- Advertisement -
ఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర టిఆర్‌ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. ధరల పెరుగుదల, జిఎస్‌టి పెంపు, ద్రవ్యోల్భణం, గ్యాస్ ధరలపై చర్చించాలని ఎంపిలు డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ ఎంపిలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేపట్టారు. విపక్షాల ఆందోళన చేపట్టడంతో పార్లమెంటులో ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడ్డాయి. అగ్నిపథ్ స్కీమ్ తో పాటు నిరుద్యోగం వంటి ప్రజాసమస్యలపై చర్చించాలని ఎంపిలు డిమాండ్ చేశారు.
- Advertisement -