Monday, December 23, 2024

పీయూష్ గోయల్‌పై హక్కుల ఉల్లంఘన నోటీసు

- Advertisement -
- Advertisement -

TRS MPs Move Notice For Privilege Motion Against Piyush Goyal

ధాన్యం కొనుగోలుపై రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు తప్పుడు
సమాధానం ఇచ్చినందుకు పార్లమెంటు ఉభయసభల్లోనూ సభా
హక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసును ఇచ్చిన టిఆర్‌ఎస్ ఎంపిలు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ దిశానిర్దేశం
మేరకు స్పీకర్‌కు, రాజ్యసభ చైర్మన్‌కు అందజేత

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఎంపిలు సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మో షన్) ఇచ్చారు. రాజ్యసభలో రూల్ 187 ప్రకారం, లోక్‌సభలో రూల్ 222 ప్రకారం అందజేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై గత వారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై పీయూష్ సమాధానమిస్తూ డబ్ల్యూటివో ఆంక్షల వల్లే పారా బాయిల్డ్ రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదన్నారు. అయితే ఆ యన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తమని ఆరోపిస్తూ సోమవారం టిఆర్‌ఎస్ ఎంపీలు ఉభయ సభల్లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి విదేశాలకు మిలియన్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను ఎగుమతి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లో ఉందని వారు తెలిపారు. మంత్రి సమాధానం సరైన రీతిలో లేని కారణంగానే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీ సు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దిశానిర్దేశం మేరకు పీయూష్ గోయల్‌పై లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లాకు పార్టీ పక్ష నాయకుడు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్‌రెడ్డి, బిబి. పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాలోతు కవిత, వెంకటేష్ నేత, రాములు అందజేశారు. రాజ్యసభలో కెకె ఆధ్వర్యంలో చైర్మన్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉభయ సభల్లో కేంద్రానికి వ్యతిరేకంగా వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. బచావో బచావో….కిసాన్ కో బచావో, వి వాంట్ జస్టిస్… వి వాంట్ జస్టిస్, కొనాలి కొనాలి….. తెలంగాణ రైతుల ధాన్యం కొనాలి, అంటూ పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. టిఆర్‌ఎస్ ఎంపీల నినాదాలతో లోక్‌సభ మారుమోగుపోయింది. అనంతరం ఉభయ సభల నుంచి ఎంపిలు వాకౌట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News