Monday, November 18, 2024

మోడీపై టిఆర్‌ఎస్ ప్రివిలేజ్ మోషన్ ను తిరస్కరించిన వెంకయ్య..

- Advertisement -
- Advertisement -

Venkaiah Naidu Refused TRS Privilege Motion against PM Modi

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై టిఆర్‌ఎస్ ఎంపీలు ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై ప్రధాని మోడీ పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రధానిపై టిఆర్‌ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. ఈ ఏడాది గత నెల 10వ తేదీన టిఆర్‌ఎస్ ఎంపిలు ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసును తిరస్కరిస్తున్నట్లుగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు బుధవారం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో తమ పార్టీ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

కానీ, ఆ సమయంలో ఎలాటి ఇబ్బందులు రాలేదన్నారు. కాని ఎపి రాష్ట్ర విభజన సమయంలోనే వివాదం నెలకొందన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య గొడవలున్నాయన్నారు. ఎపికి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో పాస్ చేసే సమయంలో పార్లమెంట్ తలుపులు మూశారని ఆయన విమర్శించారు. మైకులు కూడా కట్ చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా? అని మోడీ ప్రశ్నించారు. మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్, టిఆర్‌ఎస్ సభ్యులు తప్పుబట్టారు. ప్రధాని వ్యాఖ్యలపై రాజ్యసభ సెక్రటరీకి గత నెల 10వ తేదీన ప్రివిలేజ్ మోషన్ నోటీసును ఇచ్చారు.

Venkaiah Naidu Refused TRS Privilege Motion against PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News