Saturday, December 21, 2024

పార్లమెంట్‌లో కొనసాగిన ‘ధాన్య’ వాదం

- Advertisement -
- Advertisement -

TRS MPs protest against the Center

చర్చకు పట్టుబట్టిన టిఆర్‌ఎస్ ఎంపిలు,
తిరస్కరణ, ఉభయసభల్లో వాకౌట్
సేకరణకు స్పష్టమైన జాతీయ విధానం కావాలని ప్లకార్డుల ప్రదర్శన
కేంద్రం తీరుపై నిరసన

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ధాన్య ం సేకరణ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఎంపిలు సభలో నిరసనకు దిగారు. ఆహార ధాన్యాల సేకరణపై చర్చించాలని పట్టుబట్టారు. నిర్ధిష్టమైన జాతీయ విధానం తీసుకురావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆవరణలోనూ కేంద్రానికి వ్యతిరేకంగా టిఆర్‌ఎస్ ఎంపిలు నిరసన తెలియజేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై చర్చించాలని టిఆర్‌ఎస్ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఉభయ సభల్లో చర్చకు పట్టుబట్టారు. కానీ ఉభయసభల్లోనూ చర్చకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కేంద్రం తీరును నిరసిస్తూ లోక్‌సభ, రాజ్యసభ నుంచి టిఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. మోడీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో వెంటనే వడ్లను కొ నుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభు త్వం తీరుతో అమాయకులైన రైతులు అన్యాయానికి గురవుతున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల పట్ల కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతలను రక్షించాలని కోరారు.

ధాన్యం సేకరణలో కేంద్రం ఎందుకు సమాధానం దాటవేస్తోందని రాజ్యసభలో టిఆర్‌ఎస్ ఎంపి సురేష్‌రెడ్డి ప్రశ్నించారు. ఒడిషాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కేంద్ర విధానంతో ఇబ్బందులు పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దీనిపై వారం రోజులుగా డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రతి రోజూ వాయిదా తీర్మానం ఇస్తున్నప్పటికీ లోక్‌సభ, రాజ్యసభలో చర్చకు అనుమతించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని కించపరిచేలా కేంద్రం పెద్దలు మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరిధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.

రోజుకో మాట మాట్లాడుతూ బిజెపి నేతలు పబ్బం గడుపుకుంటున్నారనిప మండిపడ్డారు. పంజాబ్‌లో ఎలాగైతే ధాన్యాన్ని కొంటున్నారో అలాగే తెలంగాణలో వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం తీరుతో దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని దుయ్యబట్టారు. కర్షకులు, కార్మికులను ఇబ్బందులు పెట్టి.. కొందరికి కొమ్ముకాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. వ్యవసాయంపై కనీస అవగాహన లేని పియూష్ గోయల్ కేంద్ర ఆహార మంత్రిగా ఉండటం మన దురదృష్టకరమని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News