Thursday, November 14, 2024

‘తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోడీ అవమానించారు’: టిఆర్ఎస్ ఎంపీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కోట్లాది తెలంగాణ ప్రజల పోరాటాన్ని ప్రధాని మోడీ అవమానించారని తెరాస ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ల క్రితం సాధించుకున్న తెలంగాణ గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజన బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. లాఠీఛార్జ్, కాల్పుల వంటి ఘటనలేవీ జరగకుండా కేవలం రాష్ట్ర ప్రజల పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని స్పష్టం చేశారు. మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద తెరాస ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజన బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో భాజపా చెప్పాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్ చేశారు. అన్ని పార్టీలూ మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 2/3 మెజార్టీ చూసిన తర్వాతే బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారని చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని అన్నారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లవుతోందన్న కేకే.. నాటి ఘటనను మోడీ ఇప్పుడెందుకు గుర్తు చేశారని నిలదీశారు. మోడీ తెలంగాణ ప్రజలను అవమానించారని మండిపడ్డారు. రాజకీయంగా భాజపా దిగజారిపోయిందని అన్నారు.

ఎన్నో ఏళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ సాకారమైందన్నారు. విస్తృత అధ్యయనం తర్వాతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని, కీలక బిల్లుపై ఓటింగ్‌ జరిగితే సభ్యుల లెక్కింపు తప్పక జరగుతుందన్నారు. రాష్ట్ర విభజన బిల్లుకు భాజపా మద్దతు ఇచ్చిందని.. అధికార, విపక్ష పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు సంఖ్యాబలం సమస్య ఉత్పన్నం కాదన్నారు. ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందన్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన బిల్లు ఆశాస్త్రీయం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ఝార్ఖండ్ బిల్లు ఆమోదం సమయంలో కొందరు సభ్యులు వాజ్​పేయీ మీదకు దూసుకెళ్లారు. రాష్ట్రాల విభజన అనేది భావోద్వేగాలతో కూడినదని కేశవ రావు పేర్కొన్నారు.

TRS MPs Protest near Gandhi Statue in Parliament

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News