- Advertisement -
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణంలో గాంధీ విగ్రహం వద్ద సస్పెన్షన్‌కు గురైన ఎంపిలు నిరసన తెలిపారు. విపక్ష పార్టీలతో కలిసి టిఆర్‌ఎస్ ఎంపిలు నిరసన తెలిపారు. జిఎస్‌టి పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని ఎంపిలు నిరసన తెలిపారు. అప్రజాస్వామిక సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎంపిలు డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 50 గంటల దీక్ష ముగియనుంది. సస్పెన్షన్‌కు గురైన ఎంపిల దీక్షకు టిఆర్‌ఎస్ లోక్‌సభ రాజ్యసభ సభ్యులు సంఘీభావం తెలిపారు. శుక్రవారం పార్లమెంటు ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
- Advertisement -