Monday, December 23, 2024

గోయల్‌పై రేపు టిఆర్‌ఎస్ ప్రివిలేజ్ మోషన్ నోటీస్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై సోమవారం టిఆర్‌ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇవ్వనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటును, దేశ ప్రజలని, రైతులను తప్పుదోవ పట్టించినందుకుగాను కేంద్రమంత్రి గోయల్‌పై రేపు(సోమవారం) సభా హక్కుల ఉల్లంఘన(ప్రివిలేజ్ మోషన్) నోటీసులు ఇస్తామని చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తెలంగాణ రైతాంగం తరుపున ఢిల్లీ లోని పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రంతో కొట్లాడుతామని ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన వెల్లడించారు.

TRS MPs to move privilege motion against Goyal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News