Monday, December 23, 2024

రాజ్యసభలో టిఆర్‌ఎస్ పేరు బిఆర్‌ఎస్‌గా మార్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్రసమితిగా మారింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం గురువారం బులిటెన్ విడుదల చేసింది. రాజ్యసభలో బిఆర్‌ఎస్ తరఫున ఏడుగురు సభ్యులు ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. బిఆర్‌ఎస్ నేతగా కే కేశవరావు ఉన్నారని తెలిపింది. పార్టీ పేరు మార్చాలని రాజ్యసభ చైర్మన్‌కు ఫ్లోర్ లీడర్ కే కేశవరావు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు చైర్మన్ ఆమోదంతో సచివాలయం బులిటెన్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా అన్ని పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, పార్టీల వారీగా సభ్యుల సంఖ్యను రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది. గతేడాది అక్టోబర్ టిఆర్‌ఎస్ పేరు బిఆర్‌ఎస్‌గా మారుస్తున్నట్లు పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టిఆర్‌ఎస్ పార్టీ పేరు బిఆర్‌ఎస్‌గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణ శాసన మండలిలో చైర్మన్, అసెంబ్లీలో స్పీకర్ పేరును మార్పును నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News