Saturday, November 23, 2024

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు టిఆర్ఎస్ వ్యతిరేకం: కవిత

- Advertisement -
- Advertisement -

TRS opposes privatization of coal mines

హైదరాబాద్: స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో సింగరేణి ప్రగతి పథంలో పయనిస్తూ, దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోందని ఎంఎల్ సి కవిత ప్రశంసించారు. తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు,యాజమాన్యానికి ఎంఎల్ సి కవిత హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సంక్షోభంలోను సింగరేణి కార్మికులకు 29% లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మికుల పక్షాన టిబిజికెఎస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News