Friday, November 22, 2024

కులగణన జరపాల్సిందే

- Advertisement -
- Advertisement -

TRS party demands Centre to take up nation-wide caste census

లోక్‌సభలో నామా డిమాండ్

వాయిదా తీర్మానం తిరస్కృతిపై ఖమ్మం ఎంపి సీరియస్

గత 92ఏళ్ల క్రితం జరిగింది
అప్పటినుంచి కేంద్రంలోని ఏ ప్రభుత్వమూ దానిని
గురించి పట్టించుకోలేదు ఎనిమిదేళ్ల క్రితమే
టిఆర్‌ఎస్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి
పంపించింది ఒబిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు
ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసి 2014లో
పార్లమెంటుకు పంపించాం కేంద్రంలో ఒబిసిలకు
ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కూడా
మరో తీర్మానం పంపాం కేంద్రం నుంచి దేనికీ
స్పందన లేదు బిజెపి ప్రభుత్వం వర్గాల
వ్యతిరేకి రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీలు
పార్లమెంటులో ఒక్కసారైనా తెలంగాణ ప్రజల
పక్షాన నిలబడ్డాయా?

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కులగణనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని టిఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చింది. పార్టీ ఎంపిలు ఇచ్చిన ఈ తీర్మానంపై రాజ్యసభతో పాటు లోక్‌సభలోనూ తిరస్కరించారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎంపి లు ఉభయ సభల్లోనూ తీవ్ర అసంతృప్తి, ఆగ్ర హం వ్యక్తం చేస్తూ రాజ్యసభ, లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఎంపిలు రంజిత్‌రెడ్డి, రాములు, శ్రీనివాస్‌రెడ్డి, బిబి పాటిల్ తదితరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభలో పార్టీ నా యకుడు కె. కేశవరావు, లోక్‌సభలో పార్టీ నేత లు నామా నాగేశ్వర్‌రావులు మాట్లాడుతూ, కు ల గణనపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా దేశం లో కుల గణన జరగలేదని వారు పేర్కొన్నారు. ఈ అంశం చాలా ముఖ్యమైనదని, వచ్చే జనా భా లెక్కల
సందర్భంగా కులగణన కూడా చేయాలని పట్టుబట్టినప్పటికీ ఉభయ సభల్లో కూడా కేంద్రం ముందుకు రాలేదన్నారు.

తమపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఓటు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపించారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానాలను ఇస్తే….దానిని కూడా కేంద్రం పట్టించుకోకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై చర్చించడానికి మోడీ ప్రభుత్వానికి మనస్సు రావడం లేదని వారు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై నిర్విరామంగా పార్లమెంట్‌లో తమ పార్టీ పక్షాన పెద్దఎత్తున లేవనెత్తుతున్నామన్నారు. ఇందులో భాగంగానే కులగణనపై కూడా వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చామన్నారు. దాని మీద చర్చ జరగాలని కోరామన్నారు. ఈ అంశంపై చాలా పార్టీలు కూడా కోరుతున్నాయన్నారు. అయినా కూడా కేంద్రం సుముఖంగా లేకపోవడం అత్యంత దారుణమన్నారు. తాము ఇచ్చిన తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించిన కారణంగానే లోకసభతో పాటు రాజ్యసభలోనూ తమ పార్టీ ఎంపిలు సభల నుంటి వాకౌట్ చేశారన్నారు.

వాస్తవానికి ఎప్పటి నుంచో జనగణన జరగాలని టిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తున్నా… కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని నామా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎంత చెప్పినా కేంద్రం మొండికేస్తోందన్నని ఆయన ధ్వజమెత్తారు. 92 ఏళ్ల క్రితం కులగణన జరిగిందని గుర్తు చేశారు. అప్పటినుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం కులగణనకు గురించి పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. ఈ విషయంపై ఎనిమిదేండ్ల కిందటే తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని వారు స్పష్టం చేశారు. 2014లో ఒబిసిలకు పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసి పంపించామని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ఒబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తీర్మానం పంపించినా స్పందనలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి అని ఎంపి నామ అభివర్ణించారు. ఉభయసభల్లో తెలంగాణ ప్రజలు, రైతుల గురించే తాము మాట్లాడుతున్నామని అన్నారు.

ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు న్యాయం జరగాలని అనేక అంశాలను సభల్లో లేవనెత్తుతున్నామని వారు స్పష్టం చేశారు. గత నవంబర్ పార్లమెంట్ సమావేశాల్లో తొమ్మిది రోజులు నిరంతరంగా రైతుల కోసం పార్లమెంట్‌లో పోరాడామన్నారు. కొంతమంది ఎంపీలు తాము మాట్లాడలేదని చెబుతున్నారని, అయితే… తాము పోరాడిన విషయం అన్ని మీడియాల్లో వచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాల కోసమే మిగతా పార్టీలు మాట్లాడుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్న ప్రభుత్వాలు కూడా అసెంబ్లీ తీర్మానం చేయాలని బిజెపిని ఉద్దేశించి వారు హితవు పలికారు. రైతులు, ఒబిసిలు,, ఎస్సీలు, ఎస్టీల పక్షాన టిఆర్‌ఎస్ తప్ప ఏ పార్టీ ఎంపీలు పోరాడటం లేదని వారు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ఎంపీలు ఒక్కసారైనా పార్లమెంట్లో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News