Saturday, November 23, 2024

పంజాబ్‌లో ధాన్యం కొంటారు… తెలంగాణలో ఎందుకు కొనరు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధానికి దిగింది. సిఎం కెసిఆర్ పిలుపుమేరకు రైతులకు మద్దతుగా గురువారం ఇందిరాపార్కు వద్ద దగ్గర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాధర్నా చేపట్టనున్నారు. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. గురువారం మహాధర్నా రైతుల కోసమని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న మాది ప్రజల పక్షమన్నారు. కేంద్ర మొండి వైఖరిని నిరసిసతూ లక్షలాది మంది రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామని వెల్లడించారు. పంజాబ్‌లో ధాన్యం మొత్తం కొంటారని, తెలంగాణలో ఎందుకు కొనరని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రానికో విధానం అవలంభిస్తోందన్నారు. రేపటి మహాధర్నాలో ప్రజాప్రతినిధులతో పాటు టిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటాయని హరీష్ రావు సూచించారు. మహాధర్నా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా ఉంటుందన్నారు. మహాధర్నాలో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, జడ్‌పి చైర్‌పర్సన్‌లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, పార్టీ నేతలు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News