Friday, December 20, 2024

మునుగోడులో టిఆర్‌ఎస్ గెలుపు తథ్యం

- Advertisement -
- Advertisement -

సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులతో ప్రత్యేక భేటీ
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్

TRS Party victory in Munugode

మనతెలంగాణ/ హైదరాబాద్ : మునుగోడులో టిఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని సిపిఐ నాయకులను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. ఆదివారం నారాయణపూర్ మండల కేంద్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, యాదగిరిరావు, నల్లగొండ, భువనగిరి–యాదాద్రి జిల్లాల సిపిఐ కార్యదర్శులు సత్యం, శ్రీరాములుగౌడ్‌లతో ఆయన సమావేశమయ్యారు. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించేందుకు సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులతో వినోద్‌కుమార్ సమాలోచనలు జరిపారు. సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి మునుగోడు ఉప ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రచించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థికి సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రచారం ముమ్మురం చేసిన నేపథ్యంలో సిపిఐ నాయకులతో వినోద్‌కుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సిపిఐ, ఎ.ఐ.ఎస్.ఎఫ్, ఎ.ఐ.వై.ఎఫ్ నాయకులతో కలిసి నారాయణపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భూదాన్ యజ్ఞ బోర్డు రాష్ట్ర చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మునుగోడులో వినోద్‌కుమార్ విస్తృత పర్యటన..

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బోయినపల్లి వినోద్ కుమార్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి పాల్గొన్నారు. చండూరు మండల కేంద్రంలో అడ్వకేట్స్ సమావేశంలో వినోద్‌కుమార్ పాల్గొని మాట్లాడారు.

వినోద్‌కుమార్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు..

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ శివారులోని దామెర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. వాహనం దిగి పోలీసుల తనిఖీలకు వినోద్‌కుమార్ సహకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News