Saturday, November 23, 2024

మునుగోడు గులాబీదే: బడుగుల లింగయ్య యాదవ్

- Advertisement -
- Advertisement -

దళితబంధు దళితులకు వరం
మునుగోడులో ఎగిరేది గులాబీ జెండే
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్

మనతెలంగాణ/కొండమల్లేపల్లి: సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కోన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాలశీతలకరణ కేంద్రంలో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ముఖ్యంగా రై తులకు, మహిళలకు, యువకులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అ న్ని వర్గాలకు కాపాడుతున్నటువంటి వ్యక్తి సీఎం కేసీఆర్ అని అ న్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ 65 లక్షల పార్టీ సభ్యత్వాలు ఉన్నాయని అందుకని టీఆర్‌ఎస్ పార్టీ సభ్యులను గౌరవించాలనే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వనమహోత్సవ కార్యక్రమాలు చేసి పార్టీ కార్యకర్తల యోగక్షేమాలు అడిగి తెలసుకుని ము ందుకు పొమ్మని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచిదని అ న్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ జెండా మోసి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు ఇచ్చిన నాయకుడు సీఎం కే సీఆర్ అని అందులో భాగంగానే త్వరలో రాష్ట్రంతో పాటు ఉమ్మడి న ల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు, మూడు రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పార్టీ వనబోజనాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. దళితబంధు ప్రతి నియోజకవర్గంలో 1500 మ ందికి ఇవ్వాలని, అందులో భాగంగా వేంటనే మొదటగా 500 మ ందికి ప్రతి నియోజకవర్గం నుండి అందజేసేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని చెప్పడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.

రాష్ట్రంలో 1 లక్ష 77 వేల మందికి దళితబంధుతో జరుతుందని మొదటి దశలో 59 వేల మందికి ఎంపిక చేయాలని చెప్పడం చాల గొప్ప విషయమని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు దళితులకు పట్టించుకోలేదని దళితులు అణిచివేయబడి నిరాశ నిస్సృహాలకు లోనైన పేదరికంతో భాదపడే దళితులకు దళితబంధు ఒక వరంలాంటిదని అన్నారు. భారత దే శ రైతు సంఘాల నాయకులు మొత్తం వచ్చి తెలంగాణలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు రైతుబంధు, రైతుబీమా, రూణమాఫి, 24 గంటల ఉచిత కరెంట్ వంటి కార్యక్రమాల కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు అభినందించారని, ఇలాంటి కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమాలు అయ్యోలు చూడాలని కోరడం అభినందనీయమని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రజా రంజక పాలన అందిస్తు ప్రజల మన్ననలను పొందుతుంటే కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2015లో 1346 మంది రైతుల అత్మహత్యలు చేసుకుంటే 2021-22 వరకు 365 మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిదన్నారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గల్లీ రాజకీయాలు చేస్తు రేషన్ షాపుకు వెళ్లి మోడి బోమ్మ పెట్టలేదని అడగడం డిల్లీలో ఉండి పరిపాలన చేయమంటే గల్లీ రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. దళితుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆమిత్‌షా, నిర్మల సీతారామన్ ప్రత్యేకమైన మోనుతో కుడిన హోటల్ నుండి బోజనం తెప్పించుకొని తినడం వలన దళితులను అమానించినట్టు కాదా అన్ని అన్నారు. బీజేపీ నటన రాజకీయాలు తప్ప దళితుల పట్ల ఎలాంటి ప్రేమలేదని, ప్రశాంతంగా ఉన్న మునుగోడు ప్రాంతాంలో మళ్లీ ఎన్నికలు రావడానికి బీజేపి కుటిల రాజకీయాలు చేయడం వల్లనే ఎన్నికలు వస్తున్నాయని మునుగోడు ప్రజలు రాజగోపాల్‌రెడ్డికి బుద్ది చెప్పే రోజుల దగ్గర్లోనే ఉన్నాయని, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తిరుగులేదని తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 90 సీట్లు తగ్గకుండా సాధించి మళ్లీ అధికారంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని అన్నారు.

మునుగోడులో జరగబోయే ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సారధ్యంలోసీసీ రోడ్లు, సాగునీరు, త్రాగునీరు అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతుందని రవీంద్రకుమార్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ రమావత్ దస్రునాయక్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ ముచ్చర్ల ఎడుకొండల్, పట్టణ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎలిమినేటి సాయి, ఉప సర్పంచ్ గంధం సురేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News