Monday, January 20, 2025

మునుగోడులో టిఆర్ఎస్సే గెలుస్తుంది: తలసాని

- Advertisement -
- Advertisement -

Talasani Srinivas Yadav Warns BJP Party

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మంచి మెజార్టీ సాధిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బిజెపి గెలిస్తే మూడు వేల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని, దుబ్బాక, హుజురాబాద్ లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కెసిఆర్ కోరుకున్నారని, అందుకు గొల్ల, కురుమలకు ఆర్థికంగా బలోపేతం కోసం వారికి గొర్రెలను ఇస్తున్నామన్నారు. యూనిట్ విలువను లక్షా ఇరవై అయిదు వేల నుంచి 1,75 వేలకు పెంచామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత యధావిధిగా కొనసాగిస్తామని, రాష్ట్రంలో ఉన్న గొల్ల, కురుమలు ఆందోళన చెందవద్దని సూచించారు. గొర్రెల పంపిణీ బిజెపి జరగనివ్వడం లేదని, ప్రజాస్వామ్యంలో చిల్లర రాజకీయాలు కుదరవని హెచ్చరించారు. బిజెపోళ్లు కేంద్రం నుంచి రూపాయి తీసుకరావడం లేదని తలసాని దుయ్యబట్టారు.

మళ్ళీ రాజగోపాల్ రెడ్డి తన ఇల్లు అమ్మి మీకు ఇస్తా అని మాటలు చెబుతున్నారని, రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని ఎద్దేవా చేశారు. బిజెపికి ముగ్గురు ఎంఎల్ఎలు ఉన్నారని, మీ వల్ల కాదని ధ్వజమెత్తారు. బల్దియా ఎన్నికలలో పదివేల రూపాయిలు ఇచ్చామని, తాము బిజెపి మాదిరి కారు పోతే కారు, బైక్ పోతే బైక్ ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. రైతుబందు, దళిత బందు ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదని, తాను గొల్ల, కురుమల ప్రతినిధిగా చెప్తున్న, మీరు దైర్యంగా ఉండాలని తలసాని సూచించారు. ఎన్నికలు ముగిసే వరకే అడ్డుకోగలరని, నవంబర్ 6 తర్వాత గొర్ల పంపిణీ యధావిధిగా కొనసాగుతుందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ త్వరలో ప్రారంభిస్తామని, పైలట్ ప్రాజెక్ట్ క్రింద లబ్ధిదారుల ఖాతాలోకి నగదు బదిలీ చేశామని, సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వస్తున్నాయని,  అవన్నీ నిజం కాదన్నారు. డబుల్ బెడ్ రూం అనేది దేశంలో ఎక్కడ లేని స్కీమ్ అని, సిటీలో ఉపఎన్నిక వస్తుంది అన్న వార్తలు అవాస్తవమన్ననారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News