హైదరాబాద్: రాబోయే ఎన్నికలలో టిఆర్‌ఎస్ 90కి పైగా సీట్లు గెలుస్తుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. మొన్నటి సర్వే బిజెపి, నిన్నటి సర్వే కాంగ్రెస్ చేయించిందన్నారు. కానీ రెండు సర్వేలు టిఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పాయన్నారు. ప్రత్యర్థులు కూడా టిఆర్‌ఎస్ గెలుస్తుందని ఒప్పుకుంటున్నారన్నారు. వాళ్లు తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తామని సిఎం కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. అన్ని వ్యవస్థలతో పాటు ఇసి కూడా కేంద్రం చేతిలో ఉందని, రైతులపై కేంద్రం కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎంపి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నారు. సిరిసిల్లకు రాహుల్ వస్తే స్వాగతిస్తామని, వచ్చి నేర్చుకోవాలని సూచించారు. ధరణి సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఆలస్యం కావడం పెద్ద విషయం కాదన్నారు.
టిఆర్ఎస్ 90 సీట్లు గెలుస్తుంది: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -