కరీంనగర్: హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పేదరికం నుంచి ఎదిగిన నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, గెల్లును ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఓ వ్యక్తి స్వార్థం కోసం ఈ ఎన్నికలు వచ్చాయని ప్రజలకు తెలుసునని, బిజెపి దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు అమ్మడంతో పాటు ధరలు పెంచుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మడంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. పేద రైతులు వ్యవసాయం చేయకుండా బిజెపి ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ద్రోహం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారని, టిఆర్‌ఎస్ పార్టీని వెన్నుపోటు పొడిచినోళ్లంతా అడ్రస్ లేకుండా పోయారన్నారు.