- Advertisement -
హైదరాబాద్: ఎంఎల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఖాయమని మంత్రి ప్రశాంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ నియోజకవర్గ ఎంఎల్సి అభ్యర్థి సురభి విణిదేవికి మద్దతుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. బిజెపి ఎంఎల్సి అభ్యర్థి ఇంతకు ముందు ఏం అభివృద్ధి చేయలేదని, ఇకముందు కూడా చేసేదేమీ లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యపు ప్రచారాలను తప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టిసికి అధికంగా నిధులిచ్చి నిలబెట్టింది సిఎం కెసిఆరే నని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎంపి రాములు, ఎంఎల్ఎ అబ్రహం, పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్లు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -