Monday, January 20, 2025

భగ్గుమన్న గ్యాస్ మంట

- Advertisement -
- Advertisement -

వంట గ్యాస్ ధర పెంపుపై పెల్లుబికిన ఆందోళనలు

కెటిఆర్ పిలుపుతో రోడ్డెక్కిన టిఆర్‌ఎస్ శ్రేణులు
 జనం ఖాళీ సిలిండర్లతో నిరసన.. నడిరోడ్డుపై కట్టెలతో వంటలు
పలుచోట్ల మోడీ దిష్టిబొమ్మలు దహనం
ధర్మారంలో మంత్రి కొప్పుల, ఖమ్మంలో ఎంపి నామా, మంచిర్యాలలో బాల్క సుమన్ ఆందోళన

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తం గా టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతోపాటు జనం భగ్గుమన్నారు. పెద్దెత్తున జనం రోడ్లపైకి వ చ్చి కేంద్రం తీరు ను తీవ్రంగా ఎండగట్టారు. గడచిన రెండేళ్లలో వంట గ్యాస్‌పై సుమారు రూ.250పెంచి సా మాన్యుల నడ్డి విరుస్తున్నారంటూ మండిపడ్డారు. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఇచ్చిన పిలుపునకు గురువారం తెలంగాణవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, పట్టణ కేం ద్రాల్లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్యాస్ స్టవ్‌లపై కట్టెలు పెట్టి మోడీ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పేదలకు పెనుభారంగా మారిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 మేర ధర పెంచడం దారుణం అన్నారు. ముఖ్యంగా మహిళా నేతలు, కార్యకర్తలు వంట గ్యాస్ సిలిండర్లను రోడ్లపైకి తె చ్చి నిరసన చేశారు. రోడ్లపైనే వంటలు చేశా రు. ఈ సందర్భంగా పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలని డిమాండ్ చేశా రు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో జరిగిన ఆందోళనల్లో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మం త్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ ప్రముఖులు పాల్గొని కేంద్రం తీరును నిరసించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నట్టింట్లోకి ప్రవేశించి మహిళలపైనా ధరాభారం వేసిందని దెప్పిపొడిచా రు. అదేవిధంగా పెరిగిన గ్యాస్ ధరలకు నిరసన గా ఖమ్మంలో ఎంపి నామా నాగేశ్వరరా వు, ఎంఎల్‌ఎ మచ్చా నాగేశ్వరరావు, జడ్పి చైర్‌పర్సన్ కోరం కనకయ్య, ఎంఎల్‌సి తాతా మ ధు, కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొని ఆందోళన చేసి రోడ్డుపైనే వంటలు చేశారు. గ్యాస్ ధరలకు నిరసనగా కేంద్రం మొండివైఖరిని నిరసిస్తూ కరీంనగర్ చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నేతృత్వంలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మెట్‌పల్లిలో కోరుట్ల ఎంఎల్‌ఎ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ శ్రేణులు, పెద్దసంఖ్య లో మహిళలు రోడ్డుపై వంటలు చేసి మోడీ ప్రభుత్వ తీరును విమర్శించారు. కాగా, బిజె పి సర్కార్ పెంచుతున్న అధిక గ్యాస్ ధరలకు నిరసనగా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా లో ఎంఎల్‌సి పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. వరంగల్ టిఆర్‌ఎస్ పా ర్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆ రూరి రమేష్ ఆధ్వర్యంలో హసన్‌పర్తి ఎర్రగ ట్టు గుట్ట జంక్షన్ వద్ద మహిళలు, పార్టీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించి క ట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లాలో టిఆర్‌ఎస్ శ్రేణులు గ్యాస్ ధరలను నిరసిస్తూ రోడ్డెక్కి ఆందోళన చేశారు. ప్రభు త్వ విఫ్, ఎంఎల్‌ఎ బాల్క సుమన్ నేతృత్వం లో మహిళలు, కార్యకర్తలు ఖాళీ గ్యాస్ బండలతో ఆందోళన చేసి, మోడీ ప్రభుత్వాన్ని తూ ర్పారాపట్టారు. ఇంకా సిద్దిపేటలో జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎంఎల్‌ఎ చింతా ప్రభాకర్ నేతృత్వంలోనూ రోడ్డుపై రాస్తారో కో చేశారు. హైదరాబాద్‌లో ఎంఎల్‌ఎ దానం నాగేందర్ నేతృత్వంలో నగర మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, జనగామ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూ ల్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, బోదన్ ప్రాంతాలలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రజలతో కలిసి ఆందోళనల్లో పాల్గొని కేం ద్రం తీ రును తప్పుపట్టారు. తక్షణం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

TRS Protest against LPG Price hike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News