- Advertisement -
హైదరాబాద్: శివసేన ప్రభుత్వంతో బిజెపికి పని ఏంటి ? అని సిపిఐ నేత నారాయణ అన్నారు. మహారాష్ట్రలో ఈడీని ఉపయోగించి అధికారం కైవసం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ పై బిజెపి దృష్టిసారించిందని చెప్పారు. బిజెపి సమావేశాలకు ప్రధాని హైదరాబాద్ వస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. ఈడీ ద్వారా ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఇప్పటికే 24 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేశారని చెప్పిన నారాయణ వరవరరావు ఏం చేశారని జైలులో పెట్టారని ప్రశ్నించారు. బిజెపికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ జాతీయస్థాయిలో పనిచేయాలని నారాయణ కోరారు.
- Advertisement -