Sunday, December 22, 2024

నిర్మ‌ల్ మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ సస్పెన్షన్‌..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మైనర్ బాలికను ఆత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మ‌ల్ మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ షేక్ సాజిద్ ను టీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. సాజిద్ పై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసిన‌ట్లు పేర్కొన్నారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు. సోమ‌వారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మ‌రోవైపు అత్యాచార ఘటనను హేయమైన చర్యగా ఖండించారు. బాధితురాలికి న్యాయం జ‌రిగేలా చూస్తామని తెలిపారు. మైనర్ బాలిక‌పై అత్యాచారం చేసిన‌ట్లు సాజిద్ పై ఫిర్యాదు చేసిన వెంట‌నే పోలీసులు పోక్సోచ‌ట్టం కింద‌ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టార‌న్నారు.

TRS Suspended Nirmal Municipal Vice Chairman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News