Thursday, December 26, 2024

టిఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెండ్..

- Advertisement -
- Advertisement -

TRS Suspends Vanama Raghava 

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుపై అధికార పార్టీ టిఆర్ఎస్ చర్యలు తీసుకుంది. టిఆర్ఎస్ నుంచి వనమా రాఘవను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం తీర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని అదిష్టానం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే,వనమా రాఘవ అరెస్టుపై కొత్తగూడెం పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో జిల్లాలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కాగా, ఈనెల 3న ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందిస్తూ కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు బహిరంగం లేఖ రాసిన గంటల వ్యవధిలో నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వెళుతున్న క్రమంలో వనమా రాఘవను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి కొత్తగూడెంకు తరలించినట్లు వార్తలు వస్తున్న పోలీసులు అధికారికంగ వెల్లడించలేదు.

TRS Suspends Vanama Raghava 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News