Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ పార్టీకి 100 సీట్లు పక్కా: జోగు రామన్న

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ప్రజాభిష్టానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోను రూపొందించారని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ , బిజెపి పార్టీలకు ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఎంఎల్ఎ జోగు రామన్న స్పష్టం చేశారు. పట్టణంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని .. మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీల వివరాలను వెల్లడించడంతో పాటు ప్రతిపక్ష పార్టీల తీరును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ఎంఎల్ఎ జోగు రామన్న మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళలకు మూడు వేల రూపాయిల ఆర్థిక సహాయం అందించేలా హామీ ఇచ్చారన్నారు.

రూ. 400లకు గ్యాస్ సిలెండర్ అగ్రవర్ణ పేదల కోసం రెసిడెన్షియల్ మెనిఫెస్టోలో పొందు పర్చారన్నారు. దివ్యాంగులకు సైతం ఫెన్షను 4016 నుంచి 6016 రూపాయిల కు పెంచారన్నారు. ఇలానే తమ మెనిఫెస్టోలోనే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. కర్ణాటకలో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి , పట్టణ అధ్యక్షులు అజయ్,మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ , వైస్ మార్కెట్ చైర్మన్ వేణుగోపాల్‌యాదవ్ , అధికార ప్రతినిధి గంగారెడ్డి, మహిళ పట్టణాధ్యక్షురాలు స్వరూప రాణి , బుట్టి శివ రాజన్న, ఫర్వీన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News