Monday, January 20, 2025

జాతీయ రాజకీయాల్లో మార్పు

- Advertisement -
- Advertisement -

‘భారత దేశానికి ప్రగతిశీల ఎజెండా కావాలి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఇంకా మన దేశాన్ని పేదరికం ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టం చేసే ప్రజలు ఉండి వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యు లు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది? ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యం కాదు. దేశ ప్రజల సంక్షేమ ముఖ్యం. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజలకు కనీస అవసరాలు గుర్తించాలి, ప్రజల జీవితాల్లో మౌలికమైన మార్పు రావాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి.‘చరిత్ర సృష్టించాలంటే చారిత్రక ఘట్టమంతా తెలిసి ఉండాలి. చరిత్రాత్మక దృక్పథం ఉండా లి. కాలానికి ఎదురీదాలంటే కాలజ్ఞానాన్ని కలిగి ఉండాలి. కాలాంతకుడై వ్యవహరించాలి.

అంటే కెసిఆర్ నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరం, కాంగ్రెస్, బిజెపిలు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి సమృద్ధిగా ఉన్న నీటిని కూడా పొలాలకు అందివ్వలేకపో యాయన్నది కెసిఆర్ ఆ రెండు జాతీయ పార్టీలపై మోపు తున్న అభియోగం. రైతులందరికీ నీటి సౌకర్యం కల్పించడ మే అజెండా అని దానికి సంబంధించిన లెక్కలనూ చెబుతు న్నారు. తాను తెలంగాణ రైతులకేం చేస్తున్నానో దేశ వ్యాప్తంగా అదే చేస్తానని కెసిఆర్ రైతుల్లోకి సందేశం పంపుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల రైతు సమస్యల పై అవగాహన ఉంది. విప్లవానికి పరిస్థితులు పరిపక్వం కాకుండా విప్లవం రాదని చరిత్ర చెబుతోంది. పరిస్థితులు పరిపక్వంగా ఉన్నా మార్పు నకు దోహదపడే శక్తులు బలహీనంగా ఉన్నప్పుడు అది సాధ్యపడదు.

దేశ చరిత్రలో మార్పు కోసం ప్రయత్నాలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. ఆ ప్రయత్నాలు విజయ వంతం అయిన ఘటనలూ చాలా ఉన్నాయి. గమ్యాన్ని ముద్దాడాలంటే గట్టిపట్టుదల కలిగిఉండాలి. పట్టువిడుపుల ఒడుపు తెలిసి ఉండాలి. అసంభవాన్ని సుసాధ్యం చేయా లంటే ఆసాంతం అనితర సాధకుడిగా నిలబడాలి. అసాధ్యుడిగా అవతరించాలి. మన దేశంలో పట్టణీకరణ పెరుగుతున్నపప్పటికీ ఇప్పటికీ వ్యవసాయాధారిత దేశమే. రైతులే మెజారిటీ ఉంటారు. రైతు బిడ్డలే ఇతర వ్యాపకాల్లోనూ ఉంటారు. అందుకే రైతుల్ని ఏకతాటిపైకి తీసుకువస్తే రాజకీయంగా సంచలనం నమోదవుతుంది. అయితే అదంతా తేలిక కాదు. కానీ కెసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరూ నమ్మక పోయినా అనుకున్నది సాధించడానికి రంగంలోకి దిగారు. మొక్కవోని పట్టుదలతో రాష్ట్రాన్ని సాధించే వరకూ వెనక్కి తగ్గలేదు. అందుకే కెసిఆర్ అంచనా వేస్తున్న రైతు రాజకీ యం క్లిష్టంగా ఉందని.. అసాధ్యమని ఎక్కువ మంది భావిస్తున్నప్పటికీ ఆయనకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది.

వ్యవసాయాధారిత భారత దేశంలో తెలంగాణలో మాదిరి గానే రైతులకు ఇస్తున్న నిరంతర విద్యుత్ తదితర ప్రోత్సా హకాలు, అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, రైతు రుణాల మాఫీ సహా వ్యవసాయ అభివృద్ధి పథకాలన్నింటినీ దేశ వ్యాప్తంగా అమలు చేయవచ్చని కెసిఆర్ వివరించారు. ఈ దిశగా 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేంద్ర పాలకులు వహించిన నిర్లక్ష్యాన్ని కెసిఆర్ దీటుగా ఎదిరిస్తున్నారు. ముఖ్యంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తూ, దేశీయ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడు తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ దమననీతిని వారు ఖండించారు. వ్యవసాయ రంగాన్నే కాకుండా ఆర్థిక, సామాజిక తదితర అన్ని రంగాలను అధోగతి పాలు చేస్తూ రోజు రోజుకూ బిజెపి పార్టీ దిగజారిపోతున్నది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తమకు కూడా ఇలాంటి ఫలాలు అందేందుకు కెసిఆర్ దేశానికి నాయక త్వం వహించాలని దేశ ప్రజలు కోరకుంటున్నారని, అన్ని వర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్య యుతంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు అపార అనుభవం ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి ఆయన సేవలు ఎంతో అవసరం ఉన్నాయి. తెలంగాణ బిడ్డ ఢిల్లీ పీఠానికి గురి పెడుతున్నారు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించబోతున్నామని ప్రజల మనసు లో మాట. కెసిఆర్ బిజెపికి దీటుగా పోరాడగలరని, దేశం లోనే భాగమైన రాష్ట్రాల రాజకీయాలు జాతీయ రాజకీయా ల్లో భాగం కాకుండా ప్రాంతీయ రాజకీయాలుగా కుదించబ డటంలోనే నేటి వర్తమాన రాజకీయ విషాదం దాగి వుంది. ఈ విలోమ రాజకీయ విధానంనుంచి దేశాన్ని బయటపడేసి ప్రాంతీయ రాజకీయాలను దేశీయంగా మార్చేందుకు సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి భవిష్యత్తులో విప్లవాత్మకంగా మార నున్నది. ఆ దిశగా కెసిఆర్ ముందుకు తెస్తున్న సమాఖ్య రాజకీయాలు దేశ రాజకీయాలకు సరికొత్త రాజకీయ నిర్వచనాన్ని ఇవ్వనున్నాయి. ‘ఎవరైనా బలపడాలి అంటే సంకల్ప బలం ఉండాలి. సంకల్పించిన తర్వాత దాన్ని విడిచిపెట్టరాదు. గట్టిగా పట్టుకోవాలి. ఇక మిగతావన్నీ వాటంతట అవే వాళ్ళను అనుసరిస్తాయి’.

కెసిఆర్ ఇదే తత్వంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో మోడీకి, బిజెపికి ప్రత్యా మ్నాయాన్ని నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఇదేమీ జాతీయ రహదారి కాదు. అడుగడుగునా ముళ్లబాట. దారి పొడవునా సవాళ్లు, అపనమ్మకం. సరిగ్గా తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు ఎదుర్కొన్న సమస్యలు, సవా ళ్ళే కెసిఆర్‌ను చుట్టుముట్టనున్నాయి. ఆ చిక్కు ముళ్ళన్నీ ఒక్కొక్కటిగా తొలగించుకొని ముందుకు సాగి విజయం సాధించిన ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఉద్యమ అనుభవాల ను రంగరించి జాతీయ రాజకీయాలలోనూ అమలు చేసే అవకాశాలున్నాయి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో దేశంలో ఆయనకంటూ ప్రత్యేకమైన ‘బ్రాండ్ ఇమేజ్’ సంపాదించుకున్నారు. ఆ పథకాలనే ఆయన అస్త్రాలుగా మలచుకుంటున్నారు.మోడీకి వ్యతిరేకంగా ఎవరెన్ని విధాలుగా మాట్లాడినా ‘బిజెపి ముక్త్ భారత్’ అనే నినాదాన్ని సంధించిన మొదటి నాయకుడు కెసిఆర్. ఆయనకున్న భాషా పటిమ, వ్యూహ రచన శక్తి, ప్రజల్లో, రాజకీయ కార్యకర్తల్లో సూటిగా నాటుకుపో గలిగేలా కమ్యూనికేట్ చేయగలగడం కెసిఆర్ కవచ కుండలాలు.

మోడీ గద్దె దిగాలని కాంక్షించడం వేరు. ఆయనను గద్దె దింపాలని సంకల్పించడం వేరు. సంకల్పం ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు తగిన రోడ్ మ్యాపు ఉండాలి. ఆ సంకల్పాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి కావలసింది భావవ్యాప్తి నైపుణ్యం. దాన్నే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటుంటాం. ఆ నైపుణ్యం కెసిఆర్‌కు పుష్కలంగా ఉంది. విచ్ఛిన్నకర శక్తులు పేట్రేగితే ఎంత ప్రమాదమో అందరికీ తెలుసు. కానీ ‘దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాలలో చిక్కి దేశం విలవిలలాడుతుంది. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చలేదు. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తుల వలన అశాంతి ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాది మంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విద్వేషకర వాతా వరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనక్కు తీసుకుపోతుం ది. దేశం కోలుకోవడానికి మరో వంద సంవత్సరాలు పడుతుంది. దేశ ప్రయోజనాల కోసం, విద్వేష రాజకీయాల కు వ్యతిరేకంగా పోరాటం చేయడం మనందరి బాధ్యత. ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టి రాజీపడే ప్రసక్తి లేదు.

రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి. ‘కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది. విజయగర్వంతో, విపరీతమై న అధికారం వల్ల సంక్రమించిన ఉన్మాదంతో నరేంద్ర మోడీ, అమిత్ షా దేశాన్ని ఎట్లా అధోగతిపాలు చేస్తున్నారో, మతం పేరిట, కులాల పేరిట ప్రజల్ని ఎట్లా విభజించి, విద్వేషాలు రగిలించి పబ్బం గడుపుకుంటున్నారో, మత తత్వ రాజకీయాలతో ప్రజల మనసుల్ని ఎట్లా కలుషితం చేస్తున్నారో కెసిఆర్ వివరించనున్నారు. బిజెపి విద్వేష పూరిత కార్యకలాపాలను ఆయన ఎండగట్టనున్నారు. బిజెపి లక్ష్యంగానే కెసిఆర్ ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కులను నిర్లజ్జగా హరిస్తోంది. కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతుంది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పన్నులను, సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తుంది. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గు గా హరిస్తుంది.

రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బ తీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తుంది. కేంద్రానికి తలొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలు చేయక పోవడం వల్ల తెలంగాణ ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయింది. మొత్తం ఐదేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తోంది. ఈ 25 వేల కోట్ల రూపాయల కోసం చూస్తే రైతుల బావుల కాడ మీటర్లు పెట్టాలి. రైతుల నుంచి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలి. అది మన విధానం కాదు. రైతుల మీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణమున్నంత కాలం రైతాంగానికి నష్టం చేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదని, దేశ రాజకీయాల్లో 75 సంవత్సరాల పాటుగా సాగుతున్న మూస రాజకీయాల కు దేశ ప్రజలు విసుగెత్తిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నా యని, వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉంది. క్షేత్రస్థాయి ప్రజలకు వాస్తవాలు అంతా తెలుసు. ప్రత్యామ్నాయ రాజకీయంగా మాట్లాడుకునే అసలు సిసలు రాజకీయ పంథానే నేడు దేశానికి అత్యవసరం.

తీగల అశోక్ కుమారు, 7989114086

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News