Friday, January 24, 2025

మునుగోడులో టిఆర్ఎస్‌దే విజయం: వైఎస్‌ షర్మిల

- Advertisement -
- Advertisement -

TRS victory in Munugode By election: YS Sharmila

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల కోమటిరెడ్డి సోదరులని కోవర్ట్ రెడ్డి సోదరులని మండిపడ్డారు.మునుగోడు ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌టీపీ పోటీ చేయడం లేదని వైఎస్‌ షర్మిల ఒక ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ ఎన్నికలు ప్రజలను ఉద్దేశించినవి కావని, ఇవి అధికార పార్టీకి, రాజకీయ నాయకుడి దౌర్జన్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అన్నారు.దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు నేడు తెలంగాణలో జరుగుతున్నాయని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News