Saturday, December 21, 2024

ఆ డబ్బులు ఖర్చు చేయండి… ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటాం: జగదీష్

- Advertisement -
- Advertisement -

మునుగోడు: టిఆర్ఎస్ పార్టీకి రాజకీయాలు ముఖ్యం కాదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇప్పర్తిలో మంత్రి ప్రచారం చేశారు. తెలంగాణ అభివృద్దే ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పమన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన 18,000 కోట్లు కాంట్రాక్టు డబ్బులను నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు పెడితే చాలని, ఉప ఎన్నిక బరి నుంచి టిఆర్ఎస్ తప్పుకుంటుందని మంత్రి సవాలు విసిరారు. ఒక్క సీటు టిఆర్ఎస్ కు పెద్ద సమస్య కాదన్నారు. ఒక వ్యక్తికి కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుంటుందని బిజెపోళ్లకు సూచించారు. ఉప ఎన్నికలు తెచ్చిందే బిజెపి ఉనికి కోసమని దుయ్యబట్టారు.  ఆ డబ్బులను మునుగోడు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలన్నారు. అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం సిద్ధిస్తుందని తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఇప్పటికైనా స్పందించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి 18,000 కోట్లు మంజూరు చేస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, సిఎం కెసిఆర్ ను ప్రాధేయపడి ఒప్పిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News