- Advertisement -
నల్లగొండ: నోముల భగత్ విజయం ఖాయమైందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఊట్కూరు, ఎర్రబెల్లి, నందికొండొరీగూడెంలో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడారు. భారీ మెజార్టీతో టిఆర్ఎస్ విజయం దుందుభి మోగిస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బిజెపిలకు డిపాజిట్లు కూడా దక్కవని, మోడీ ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్కు ఓటేస్తేనే తెలంగాణ సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉంటుందని, సిఎం కెసిఆర్ ప్రజల సంతోషం కోసం రేయింబవళ్లు పని చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రచారంలో జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్ఎలు భాస్కర్ రావు, మల్లయ్య యాదవ్, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.
- Advertisement -