Tuesday, January 21, 2025

ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిఆర్‌ఎస్‌దే విజయం…

- Advertisement -
- Advertisement -

టిఆర్‌ఎస్ రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించేలా
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ చైర్మన్‌లందరూ
క్రియాశీలకపాత్ర పోషించాలి
రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ చైర్మన్ రాజు వెన్ రెడ్డి

 

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా చైర్మన్లు అందరూ క్రియాశీలకపాత్ర పోషించాలని మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ కార్యవర్గ సమావేశం ఛాంబర్ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా ఛాంబర్ చైర్మన్ రాజు వెన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అనేక పథకాలకు, ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే విధంగా బిజెపి వ్యవహారిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 129మంది చైర్మన్‌లు అప్రమత్తంగా ఉండి బిజెపి కుయుక్తులను తిప్పికొడుతూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పనిచేయాలని కార్యవర్గ సమావేశం నిర్ణయించిందన్నారు.

ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ విజయానికి రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్‌లందరూ తమవంతు పాత్ర పోషించారన్నారు. అలాగే రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ ఎదుర్కొంటున్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తీర్మానం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చైర్మన్‌ల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి బిజెపి పన్నిన పన్నాగంలో భాగంగా అమ్ముడుపోకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నలుగురు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఛాంబర్ సంఘీభావం ప్రకటించి వారిని ప్రశంసించిందన్నారు. కార్యవర్గ సమావేశంలో కార్యదర్శి ఎడ్మ సత్యం, స్రవంతి చందు, నర్సింహా గౌడ్, బస్వరాజుగౌడ్, సుధాహేమేందర్ గౌడ్, అనిత రామక్రిష్ణ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News