Sunday, December 22, 2024

మునుగోడులో టిఆర్ ఎస్ గెలుపు… వడలిపోయిన కమలం!

- Advertisement -
- Advertisement -

11666 మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం

హైదరాబాద్: మునుగోడులో ‘కారు’  స్పీడుకు తగ్గ జోరందుకోలేని ‘కమలం’ పార్టీ వెనుకబడిపోయింది. మొత్తం 15 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. దాదాపు 11వేల ఓట్లకు పైగా మెజారిటీతో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. రెండు, మూడవ రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలో తెరాస తన సత్తా చాటుకుంది. ఇక సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ తన డిపాజిట్‌ను కోల్పోయింది. మునుగోడు, తెలంగాణ భవన్ వద్ద తెరాస కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. చివరికి మునుగోడు మొనగాడుగా టిఆర్‌స్ అభ్యర్థే నిలిచారు. చివరి 15వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 101853, బిజెపికి 90187, కాంగ్రెస్‌కు 23243 ఓట్లు వచ్చాయి. తెరాస 11666 మెజారిటీతో గెలిచింది. ఇది బిజెపికి చెంపపెట్టు వంటిదని సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన ముగ్దూం భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. కాగా ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటికీ ఇది టిఆర్‌ఎస్ అధర్మపు గెలుపని, నైతిక విజయం తనదేనని దబాయిస్తున్నాడు. బిజెపిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వకుండా పనిచేస్తామని కమ్యూనిస్టు పార్టీలు అంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News