Tuesday, November 5, 2024

మునుగోడులో టిఆర్ఎస్ దే గెలుపు: తలసాని

- Advertisement -
- Advertisement -

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్తం చేశారు. గురువారం సనత్ నగర్ లో 3.87 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి ప్లోరిన్ భారిన పడి అనేక మంది అంగ వికలాంగులుగా మారారని, అనారోగ్యంతో బాధపడేవారని, మిషన్ భగీరధ కార్యక్రమంతో సురక్షితమైన త్రాగునీటిని ఇంటింటికి సరఫరా చేయడం వలన ప్లోరిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. 50 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్లోరిన్ సమస్యను ఎందుకు పరిష్కరించలేదని తలసాని ప్రశ్నించారు.

హుజూరాబాద్, దుబ్బాక నియోజక వర్గాలలో గెలిచిన బిజెపి ఎంఎల్ఎలు కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చారో, ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి స్వార్ధం వలనే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చాయని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి టిఆర్ఎస్ తోనే సాధ్యమని, ముఖ్యమంత్రి పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తలసాని చెప్పారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాటిఆర్ఎస్ పార్టీ వెంటే ప్రజలు ఉన్నారని, మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News