Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

TRS Workers praise to CM KCR

 

మన తెలంగాణ/సూర్యాపేట కల్చరల్ : టిఆర్‌ఎస్ ప్ర భుత్వం నిరంతరం రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల ఆనంద్ అన్నారు. రైతుబంధు సహాయం రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేసిన సందర్భంగా శుక్రవారం వ్యవసా య మార్కెట్‌లో చైర్‌పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్, మంత్రి జగదీష్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కెసిఆర్ రై తుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుభీమా పథకాలు ప్రవేశపెట్టారని, లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అ ందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని అ న్నారు.

మంత్రి జగదీష్‌రెడ్డి కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో కరువు ప్రాంతాలైన తుంగతుర్తి, ఆత్మకూరు నుండి పెన్‌పహాడ్ వరకు కాలువల ద్వారా సాగు నీరు అందడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో వా నాకాలం పంటకు కనీస మద్ధతు ధర చెల్లించి కొనుగో లు చేసినట్లు చెప్పారు. అనంతరం మార్కెట్ సిబ్బందికి నూతన యూనిఫాంలను అందజేశారు. ఈ కార్యక్రమం లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, జడ్పిటీసి జీడి భిక్షం, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ కక్కిరేణి నాగయ్య, మా ర్కెట్ కార్యదర్శి ఫజియొద్దిన్, మార్కెట్ కమిటీ వైస్ ఛై ర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, డైరెక్టర్లు సల్మా మస్తాన్, రైతులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

పెన్‌పహాడ్ : రైతుబాంధవుడు, రైతు పక్షపాతి తెలంగా ణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర విద్యుత్తు శాఖ మ ంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు. మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పిటీసి మామిడి అనిత అంజయ్య, మండల పార్టీ అధ్యక్షు డు దొంగరి యుగంధర్ పాలాభిషేకం చేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను రైతులకు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమ ంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి దక్కిందన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో రైతులకు ఉచిత కరెంటు, సాగునీ రు, రైతుబంధు, రైతుభీమా, ధాన్యం కొనుగోలు కేంద్రా ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రంది లే ని వ్యవసాయాన్ని చేయడానికి కృషి చేస్తూ రైతు కుటుంబాలు సంతోషంగా ఉండడానికి కృషి చేశాడని తెలిపా రు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సింగారెడ్డి, పిఎసిఎస్ ఛైర్మన్లు వెన్న సీతరాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, పొదిల నాగార్జున, బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అనంతుల శ్రీనివాస్, దంతాల వెంకన్న, ఊరుకొండ జానకమ్మ, రాధాకృష్ణ, గార్లపాటి స్వర్ణ, దాచేపల్లి భరత్, కో ఆప్షన్ స భ్యులు ఎస్.కె.రఫి, గుర్రం అమృతారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నల్లపు శ్రీను, కీర్తి వెంకటరాజు, గంగారపు శ్రీను, సోష ల్ మీడియా కో ఆర్డినేటర్ రవి యాదవ్ పాల్గొన్నారు.

సూర్యాపేట : నేటి తెలంగాణకు బంగారు బాటలు వే స్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రజలు రుణపడి ఉంటారని టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తూడి న ర్సింహారావు అన్నారు. రైతుబంధు రైతుల జమ చేసిన స ందర్భంగా సిఎం కెసిఆర్, మంత్రి జగదీష్‌రెడ్డి చిత్ర ప టాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సంతోషంగా వ్యవసాయం సాగు చేసుకునేలా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చే స్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చె రుకు శ్రీనివాస్, కొంగలి వీరయ్య, గడ్డం భిక్షంరెడ్డి, కం చర్ల సత్తిరెడ్డి, మున్నా సోమలింగయ్య, రాచకొండ శ్రీని వాస్, శంకర్, సైదులు, కప్పల నాగయ్య, శ్రీనివాస్, గో వర్ధన్, యాదయ్య, మల్సూర్, పాల్గొన్నారు.

సూర్యాపేట రూరల్ : రైతు పక్షపాతి సీఎం కెసిఆర్ అ ని ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పిటీసి జీడి భిక్షం, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం మండలంలోని కేసారం గ్రా మంలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతుబంధు పథకం డబ్బులు జమ చేసిన సందర్భంగా సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో రైతుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటే సీ ఎం కెసిఆర్ హయాంలో రైతుల జీవితాల్లో వెలుగులు ని ంపారని చెప్పారు. మ్ంర తి జగదీష్‌రెడ్డి కృషితో నేడు తు ంగతుర్తి, సూర్యాపేట ని యోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స ర్పంచ్ మెంతబోయి న నాగయ్య, వైస్ ఎంపీపీ రామసా ని శ్రీనివాస్ నాయుడు, ఏఎంసి డైరెక్టర్ ఎస్.రమణారె డ్డి, గొర్లగన్నారెడ్డి, పా ముల ఉపేందర్, మామిడి కిరణ్, కొల్లు నరేష్, బంటు సైదులు, నాగరాజు, కిషోర్‌రెడ్డి, ఆ దారి, షరీప్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News