Monday, December 23, 2024

ఇజ్రాయెల్ -హమాస్ మధ్య సంధి?

- Advertisement -
- Advertisement -

ఒప్పందానికి చేరువవుతున్నామంటూ జో బైడెన్, హమాస్ చీఫ్ ప్రకటన

దోహా: ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో రెండింటిమధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియాలు చేసిన ప్రకటనలే ఇందుకు నిదర్శనం. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరిపిన హమాస్ మిలిటెంట్లు 200 మందికి పైగాతమ చెరలో బంధించారు. వీరిని విడిపించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరో వైపు వీరిని విడిచిపెట్టేదాకా దాడులు అపేది లేదని ఇజ్రాయెల్ తెగేసి చెబుతోంది. గాజాపై నిరిరామంగా బాంబుదాడులతో విరుచుకు పడుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో13,300 మందికి పైగా జనిపోయినట్లు గాజాలోని హమాస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఖతర్ మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న సంధి ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయని అమెరికా వెల్లడించింది.

బందీలను విడిచిపెట్టడానికి సంబంధించి ఒక ఒప్పందం తుది దశలో ఉన్నట్లు తాను నమ్ముతున్నానని అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం విలేఖరులతో అన్నారు. మరో వైపు హమాస్ అధిపతి స్మాయిల్ హనియానుంచి కూడా ఇదే తరహా స్పందన వెలువడింది.‘ ఇజ్రాయెల్‌తో సంధికి చేరువవుతున్నాం’ అని సోషల్ మీడియా పోస్టులో హనియా తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా అయిదు రోజులు గాజాలో క్షేత్రస్థాయి దాడులకు విరామం ఇస్తారు. అయితే దక్షిణ గాజాపై వైమానిక దాడులు మాత్రం కొనసాగుతాయి.

దీనికి ప్రతిగా హమాస్, మరో పాలస్తీనియన్ గ్రూపు ఇస్లామిక్ జిహాదీలు తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో 50నుంచి వంద మందిని విడిచి పెడతాయి. రంతా ఇజ్రాయెలీ పౌరులు, ఇతర దేశాలకు చెందిన వారే ఉంటారు తప్ప ఇజ్రాయెల్ సైనికులు ఎవరూ ఉండరు. ఈ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న సుమారు 300 మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News