Sunday, December 22, 2024

ఆటోను ఢీకొట్టిన పికప్ వాహనం: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై : పూణె జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడికి 150 కిమీ దూరంలో గల కళ్యాణ్‌అహ్మద్‌నగర్ రోడ్డు లోని ఓటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పికప్ వాహనం స్పీడ్‌గా వచ్చి ఆటో రిక్షాను ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని పోలీస్‌లు సోమవారం తెలిపారు. అహ్మద్‌నగర్ నుండి కళ్యాన్ (థానే జిల్లా) వైపు పికప్ వాహనం వెళ్తుండగా, పింపాల్ గావ్ జోగా వద్ద పెట్రోల్ పంపు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో రిక్షాను ఢీ కొట్టిందని పోలీస్‌లు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురితోపాటు పికప్ వాహనం డ్రైవర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News