Saturday, December 21, 2024

మహారాష్ట్రలో ట్రక్కు బస్సు ఢీ..10 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

 

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం నాసిక్‌లోని పఠారే ప్రాంతంలోని సిన్నర్-షిర్డీ రహదారిపై ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సు ట్రక్కు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో  లగ్జరీ బస్సులో ఉన్న 40 మంది సాయిబాబా భక్తులలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు వారిని పోలీసులు సిన్నార్ గ్రామీణ ఆసుపత్రికి , సిన్నార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి  అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు.

మృతుల కుటుంబానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.  పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అతివేగం కూడా కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News