Thursday, January 16, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీని ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. దొండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భానుప్రతాప్‌పూర్‌-దల్లిరాజహార రహదారిపై చౌరపవాడ్‌ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అశోక్ జోషి తెలిపిన ప్రకారం.. “ఎదురుగా వెళ్తున్న ట్రక్కు SUVని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం రాజ్‌నంద్‌గావ్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుం అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News