Sunday, December 22, 2024

లారీలు ఢీ.. తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని దయ్యాల గండి మూలమలుపు వద్ద శనివారం జాతీయ రహదారిపై జరిగింది. యస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున గ్రానైట్ లోడుతో ఆంధ్రా నుంచి ఒకదాని వెనకాల ఒకటి హైదరాబాద్ వైపు వెళ్లుతున్న రెండు లారీలు దయ్యాల గండి మూలమలుపు వద్ద ముందుగా వెళ్లుతున్న లారీని వెనక లారీ ఓవర్టెక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా మాచర్ల వైపు వెళ్లుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు హఠాత్తుగా రావటంతో కంగారులో ఎదురుగా ఉన్న లారీని బలంగా ఢీకొనటంతో లారీ కుడి పక్క భాగం పూర్తిగా దెబ్బతిని రెండు లారీలు ఒకదానికొకటి ఇరుక్కుపోయి రోడ్డుకు అడ్డంగా ఆగిపోయాయని రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని, వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్లియర్ చేశారని తెలిపారు. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News