Monday, December 23, 2024

కేంద్రంతో చర్చల అనంతరం సమ్మె విరమించిన ట్రక్కు డ్రైవర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హిట్‌అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన కొత్త చట్టంపై రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డైవర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం కేంద్రంతో కీలక చర్చలు జరిపిన అనంతరం అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని అలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్( ఎఐఎంటిసి) ప్రకటించింది. కొత్త చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను త్వరలోనే ఉపసంహరించుకుంటామని దేశవ్యాప్తంగా ట్రక్కర్ల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అసోసియేషన్ ప్రకటించింది. ‘ భారతీయ న్యాయసంహితలోని నిబంధనలపై మేము ప్రభుత్వంతో సమావేశమై చర్చించాం. కొత్త చట్టాలు ఇంకా అమలు కాలేదు.

ఎఐఎంయుసితో చర్చించిన తర్వాతే దాన్ని అమలు చేయడం జరుగుతుంది’ అని అసోసియేషన్ కోర్ కమిటీ చైర్మన్ మల్కిత్ సింగ్ చెప్పారు. త్వరలోనే సమ్మె ముగుస్తుందని, డ్రైవర్లందరినీ విధుల్లో చేరాలని కోరినట్లు కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా దీనిపై ఒక ప్రకటన చేశారు. ‘హిట్ అండ్ రన్ కేసుల్ల్లో పదేళ శిక్షను విధించడానికి ఉద్దేశించిన చట్టంపై భారత మోటారు ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్( ఎఐ ఎంటిసి)తో చర్చ జరిగింది. ఈ చట్టం ఇంకా అమలు కాలేదు. ఎఐఎంటిసితో చర్చించిన తర్వాత దాన్ని అమలు చేస్తాం’అని భల్లా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News