Wednesday, January 15, 2025

ఘెర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు యాత్రికులు మృతి

- Advertisement -
- Advertisement -

రాంగ్ సైడ్ లో దూసుకొచ్చిన ఓ ట్రక్కు, వాస్ ను ఢీకొట్టడంతో ఆరుగురు యాత్రికులు మృతి చెందారు. ఈ విషద సంఘటన రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో ఆదివారం (సెప్టెంబర్ 15) తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యాత్రికులు సికార్ జిల్లాలోని ఖతు శ్యామ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ట్రక్కు రోడ్డుకు రాంగ్ సైడ్‌లోకి వచ్చి వ్యాన్‌ను ఢీకొట్టిందని.. మృతులను 16 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న మదన్ నాయక్, మంగీలాల్ నాయక్, మహేష్ నాయక్, రాజేష్, పూనమ్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News