Wednesday, February 12, 2025

కుంభమేళాకు వెళ్లివస్తూ.. అనంతలోకాలకు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాచారం: హైదరాబాద్ నుం చి కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా నగర వాసులు ఏడుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మర ణం పాలయ్యారు. రాంగ్‌రూట్‌లోవచ్చిన సిమెం ట్ లారీ ఢీకొట్టడంతో టెంపో ట్రావెల్స్ (మినీ బ స్సు)లో ప్రయాణిస్తున్న నగర వాసులు మృత్యువాత పడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్ప ల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్‌కు చెం దిన భక్తులు మహా కుంభమేళాకు బస్సు యా త్రగా నాచారం నుండి బయలుదేరారు. తిరుగుప్రయాణంలో మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జి ల్లా సిహోరా వద్ద మినీ బస్సును రాంగ్ రూట్‌లో వచ్చిన సిమెంట్ లారీ ఢీకొట్టడంతో మినీ బస్సు లో ప్రయాణిస్తున్న 9 మందిలో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నాచారం వాసులుగా గుర్తించినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు నా చారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతుల ఇంటి వద్ద ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. నాచారం పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల మహా కుంభమేళా యాత్ర కోసం నాచారం నుండి ఎపి 29డబ్యూ1525 నెంబరు గల మినీ బస్సులో ఈనెల 7వ తేదీ శుక్రవారం నాచారం నుండి 9 మంది ప్రయాణమయ్యారు. రాఘవేంద్రనగర్‌కు చెందిన శశికాంత్ (37)

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, కార్తికేనగర్‌కు చెందిన మల్లారెడి (60) కార్తికేయనగర్ కాలనీ ప్రెసిడెంట్ , నాచారం ఎర్రకుంటకు చెందిన బోవరంపేట్ సంతోష్ కుమార్ (47), సరూర్‌నగర్‌కు చెందిన రాజు డ్రైవర్ (38), తార్నాకకు చెందిన సుంకుజు నవీన్ (52), సరూర్‌నగర్ బ్యాంక్ ఆఫ్ బరోబా, లాజిస్టిక్ మేనేజర్ టి.వి ప్రసాద్ (50), 7. గోల్కొండ ఆనంద్ (47), శ్రీరామ్ బాలకృష్ణ (63), 9.రవికుమార్ (59) నిర్వాహకుడు అందరూ కలిసి 7వ తేదీన మధ్యాహ్నం మినీ బస్సులో మహ కుంభమేళాకు నాచారం నుండి ప్రయాణమయ్యారు. కుంభమేళా దర్శనం చేసుకొని అనంతరం తిరుగు ప్రయాణంలో 11 తేదిన మొత్తం తొమ్మిది మంది కలిసి మినీ బస్సులో వస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ వద్ద సిమెంట్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు ప్రయాణికులు మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరు అందులో న్యూ మారుతి నగర్ నాగోల్‌కు చెందిన నవీన్ చారి కాలు విరిగిపోయి, నాచారంకు చెందిన బాలకృష్ణకు తీవ్రగాయాలు కావడంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆసుపత్రిలో చేర్పించినట్టు నాచారం పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో నాచారం వాసులు మృతి చెందిన విషయం మృతుల కుటుంబాలకు తెలియగానే కాలనీలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. గాయపడిన వారిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు అతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

మృతుల కుటుంబసభ్యుల రోదనకు చుట్టుపక్కల వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఉదయం తిరుగు ప్రయాణం చేస్తున్నామని ఇంటికి వచ్చేస్తున్నామని చెప్పిన తమ వారు అనంతలోకాలకు వెళ్లిపోయారని తీవ్ర దుఖంతో మృతుల కుటుంబీకులు రోధించారు. ఘటన విషయం తెలుసుకున్న ఉప్పల్ నియోజకవర్గ ఎంఎల్‌ఎ బండారి లకా్ష్మరెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్‌తో మాట్లాడి మృతదేహాలను వెంటనే తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఫోన్‌లో ఉప్పల్ మండల అధికారులతో మాట్లాడి వారి కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను రేపటిలోగా తెప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. కాగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఎంపి ఈటెల్ రాజేందర్, ఎంఎల్‌ఎ బండారి లకా్ష్మరెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని వారు కోరారు.ప్రమాదంలో గాయపడిన వారికి సైతం మెరుగైన చికిత్స అందించే విధంగా ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షించాలని కోరారు.

సిఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా పరిధిలో హైదరాబాద్‌కు చెందిన బస్సు ప్రమాదంపై సిఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం గురించి సిఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అదేవిధంగా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.హైదరాబాద్ పరిధిలోని నాచారం నుంచి కొంత మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ కుమినీ బస్సులో వెళ్లారు. అయితే, తిరుగు ప్రయాణంలో బజల్‌పూర్ జిల్లా కేంద్రానికి 65 కి.మీ. దూరంలో ఉన్న సిహోరా పట్టణ శివారులో ఈ మినీ బస్సును ఎదురుగా వన్‌వేలో వస్తున్న ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మంత్రులు, పిసిసి అధ్యక్షుడు సైతం మృతులకు సంతాపం తెలియచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News