Saturday, December 21, 2024

ముంబై–పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు బీభత్సం

- Advertisement -
- Advertisement -

Truck Hits Multiple Vehicles on Mumbai-Pune Expressway

నలుగురి మృతి.. ముగ్గురికి గాయాలు

పుణె: ముంబై–పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం ఉదయం ఒక కంటెయినర్ ట్రక్కు అనేక వాహనాలను ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఖొపోలి ప్రాంతంలోని బోర్ఘట్ సమీపంలో ఉదయం 6.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ స్టీరింగ్‌పై అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వాహనాలతో రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేలో మొదట ఒక కారును ఢీకొన్న కంటెయినర్ తర్వాత మరో నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ప్రమాద స్థలానికి సహాయ బృందాలతో పోలీసులు చేరుకున్నారు. ఒకే కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు ఈ ప్రమాదంలో మరణించారు. మరో కారులోని ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీపంలోని నవీ ముంబైకు చెందిన కమోతెలోని ఒక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించినట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News