Monday, January 20, 2025

లారీ- ప్రైవేటు బస్సు ఢీ: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పుణె: మహారాష్ట్ర రాష్ట్రంలోని పుణె-బెంగళూరు హైవేపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగ దూసుకొచ్చిన లారీ- ప్రైవేట్ బస్సు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రును చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

ముంబై-బెంగళూరు జాతీయ రహదారి వెంబడి స్వామినారాయణ దేవాలయం సమీపంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రమాదం సంభవించిందని పోలీసులు వెల్లడించారు. సతారా నుండి థానేలోని డోంబివిలీకి వెళ్తున్న ప్రైవేట్ ప్యాసింజర్ బస్సును వెనుక నుండి లారీ ఢీకొట్టిందని అధికారులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News