Monday, January 20, 2025

జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపుర్ ఖేరీ జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ రైడర్‌ను రక్షించే ప్రయత్నంలో ట్రక్కు అదుపు తప్పి జనంపై దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. లఖింపుర్ ఖేరీ లోని సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధి లోని పాంగి ఖుర్ద్ గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది.

ఎదురుగా వస్తున్న ఒక బైకును తప్పించేందుకు ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని మరోవైపుకు తిప్పాడు. అయితే స్టీరింగ్ ఫెయిలై జనం పైకి దూసుకెళ్లింది. రోడ్డుపై జనం కనిపించక పోవడంతో ట్రక్కు డ్రైవర్ పొరపాటు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News