Sunday, December 22, 2024

బస్సుపైకి దూసుకెెళ్లిన ట్రక్కు.. 11మంది మృతి, 10మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

యూపీ: ఉత్తర ప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజహాన్‌పూర్‌లోని ఖుతార్ పీఎస్ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు అదుపు తప్పి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై షాజహాన్‌పూర్ ఎస్పీ అశోక్ కుమార్ మీనా మాట్లాడుతూ.. రాత్రి 11 గంటల సమయంలో ఖుతార్ పీఎస్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. రోడ్డు ప్రక్కన ఉన్న దాబా దగ్గరు బస్సు ఆగింది. పూర్ణగిరికి వెళ్లే భక్తులు కొంతమందవి బస్సులో కూర్చోగా.. మరికొందరు భక్తులు దాబాలో భోజనం చేయడానికి వెళ్లారు. ఈక్రమంలో ట్రక్‌ అదుపు తప్పి బస్సుపైకి దూసుకెళ్లింది అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News