Wednesday, January 22, 2025

రైలుబోగీని తరలిస్తున్న ట్రక్కుకి ప్రమాదం.. ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

భాగల్‌పూర్ (బీహార్): ఆదివారం రైలుబోగీని తరలిస్తున్న ట్రక్కు బ్రేకులు ఫెయిలై భాగల్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపాన ప్రమాదానికి గురైంది. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. స్టేషన్‌కు సమీపాన లోహియా బ్రిడ్జి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకున్నా ట్రక్కుపై రైలు బోగీ ఉండడాన్ని స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.

స్థానిక పోలీస్‌లు, రైల్వేఅధికారుల సాయంతో ట్రాఫిక్ రద్దీ లేకుండా పరిష్కరించారు. స్టేషన్‌కు సమీపాన రైల్వే కాంప్లెక్సులో రెస్టారెంట్ ఏర్పాటు కోసం బోగీని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని డిఆర్‌ఎం వికాస్ చౌబే విలేఖరులకు చెప్పారు. ఇదే విధంగా శుక్రవారం స్క్రాప్ అయిన విమానాన్ని లక్నో నుంచి అస్సాంకు ట్రక్కు ద్వారా తరలిస్తుండగా తూర్పు చంపారన్ మోటిహరి వద్ద బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News