Monday, December 23, 2024

అక్రమంగా తరలిస్తున్న బైరటీస్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

గార్ల: అక్రమంగా తరలిస్తున్న బైరటీస్ ఖనిజాపు లారీని గార్ల పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గార్ల ఎస్సై బి. వెంకన్న తెలిపిన వివరాలి ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఐదున్నర సమయంలో పెట్రోలింగ్ చేస్తుండగా పుల్లూరు గ్రామ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా బైరటీస్ ఖనిజాన్ని తరలిస్తున్న లారీ పోలీసుల కంట పడిందని పేర్కోన్నారు. ఈ మేరకు కోట్యానాయక్ తండా సమీపంలో తెల్లరాయి గుట్ట నుంచి సుమారు రూ. 80వేల విలువైన ఈ ఖనిజరాయిని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే

తరలిస్తున్నా గుగులోతు భీమా, దేవుళ్ల వెంకటేశ్వరరావు, దేవుళ్ల వెంకట గురువులను ప్రశ్నించగా వారి వద్ద ఎలాంటి అనుమతిపత్రాలు లేవని స్పష్టమైందని ఎస్సై వివరించారు. దొంగతనంగా లారీలో లోడ్ వేసుకుని అక్రమంగా రవాణా చస్తుండగా ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని లారీని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న వెల్లడించారు. ఈ లారీని అదుపులోకి తీసుకోవడంలో ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News