Friday, January 24, 2025

ట్రూ ఎలిమెంట్స్ సంచలనాత్మక నూతన క్యాంపెయిన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ మొట్ట మొదటి క్లీన్ లేబుల్, 100% హోల్ గ్రెయిన్ సర్టిఫైడ్ ఫుడ్ బ్రాండ్ అయిన ట్రూఎలిమెంట్స్ ఎలాంటి పదాల మాయాజాలం, రసాయనాలు, నిల్వకారకాలు లేదా యాడెడ్ షుగర్ లేకుండా 100% రుచిని అందిస్తామన్న వాగ్దానంపై నిర్మించబడింది, ‘అబద్దం చెప్పని ఆహారాన్ని’ అందిస్తోంది. ఇప్పుడు ఈ బ్రాండ్ తాత్వికతను చాటిచెప్పేలా ట్రూ ఎలిమెంట్స్ తన మొట్టమొదటి క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ వినూత్న క్యాంపెయిన్ నాలుగు సంబంధిత ఫిల్మ్స్ ను హాస్యభరితంగా అందిస్తోంది. సానిక్, ఎఎస్ఎంఆర్ ఫండమెంటల్స్ పై నిర్మించబడిన, మనస్సులో ఎప్పటికీ నిలిచిపోయేవిగా ఇవి రూపుదిద్దుకున్నా యి. ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ ఈ బ్రాండ్ ను గుర్తు చేసేవిగా ఈ బ్రాండ్ కు విలక్షణ గొంతుకను అందిస్తాయి.

మార్కెట్ లో లభించే ప్యాకేజ్డ్ ఫుడ్ లో అత్యధిక శాతం వాటిలో, దీర్ఘకాలిక షెల్ప్ లైఫ్ కోసం లేదా మెరుగు పర్చబడిన రుచి కోసం అనారోగ్యకరమైన అడిటివ్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా ఉండే అర్థసత్యాల ప్రకటనలతో తమను తాము ఆరోగ్యదాయకాలుగా చాటుకుంటూ ఉంటాయి. కొనుగోలుదా రులు తెలివైన వారని, ఒక బ్రాండ్ అబద్దం చెబితే దాన్ని మార్చివేస్తారనే ట్రూ ఎలిమెంట్ దృక్పథా న్ని ముందుకు తీసుకెళ్లేది ఈ అంశమే. ఈ అంశం ఆధారంగా రూపుదిద్దుకున్న ట్రూ ఎలిమెంట్ క్యాంపెయిన్, అబద్దాలు చెప్పడం నుంచి నిజం చెప్పడం దాకా అటూ ఇటూ మారడం ఇందులో ప్రధానాంశంగా ఉంటుంది. అందులోనే క్లీన్ లేబుల్ సర్టిఫైడ్ రోల్డ్ ఓట్స్, నట్స్ అండ్ బెర్రీస్ మ్యూస్లి, 7-ఇన్-1 సీడ్స్ మిక్స్ ఉత్పాదనలను ప్రముఖంగా చూపిస్తుంది. ఈ నాలుగు ఎంగేజింగ్ ఫిల్మ్స్ లో రెండు 30 సెకన్ల నిడివితో, మరో రెండు 10 సెకన్ల నిడివితో ఉంటాయి. మనస్సులో నాటుకు పోయే ‘ట్రూయింగ్ ట్రూయింగ్, వాట్ యూ డూయింగ్’ అనే క్యాచీ ఇయర్ వామ్ వీటి స్టోరీ టెల్లింగ్ ను మరింత శక్తివంతం చేస్తుంది.

30 సెకన్ల నిడివి ఉండే రెండు ఫిల్మ్ లు కూడా బ్రేక్ ఫాస్ట్ లాంటి మనకు జీవితంలో ఎదురయ్యే సాధారణ సంద ర్భాల పైనే రూపుదిద్దుకున్నాయి. అబద్దం చెప్పినప్పుడు ఆయా పాత్రలు (బాస్ – ఉద్యోగి, తల్లి- కూతురు) ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుపోవడం ఇందులో చూడవచ్చు. వారు ట్రూ ఎలిమెంట్స్ ను కాస్త తినగానే అస లైన నిజం బయటకు వస్తుంది. అబద్దం చెప్పని ఆహారంతో, దాన్ని తిరువాత ఆయా పాత్రలు అబద్దం చెప్పక పోవడాన్ని ఇవి ప్రదర్శిస్తాయి.

ఈ సందర్భంగా ట్రూ ఎలిమెంట్స్ సహవ్యవస్థాపకులు, సీఈఓ అయిన పురు గుప్తా మాట్లాడుతూ, ‘‘మేం మా తదుపరి వృద్ధి దశలోకి ప్రవేశిస్తుండడంతో, ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నప్పటికీ, ‘క్లీన్ లేబుల్’ పై అవగాహన లేని కుటుంబాలను చేరుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఈ ప్రపంచాన్ని సరళీకరించేందుకు, బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ శ్రేణితో వారి వంటిళ్లలోకి వెళ్లేందుకే మా ప్రయత్నం. మేం ఈ కేటగిరీకి కాస్తంత భిన్నమైన ప్రచారతీరును ఉప యోగిస్తున్నాం. ఉత్పాదనల్లో ఉండే పదార్థాలు లేదా అవి అందించే ప్రయోజనాల గురించి హేతుబద్దంగా మాట్లా డడం అని గాకుండా, ఒక బ్రాండ్ గా ‘అబద్దాలు చెప్పకపోవడం’ చుట్టూ క్యాంపెయిన్ ను తిప్పుతున్నాం. ఇది వీక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

ట్రూ ఎలిమెంట్స్ మార్కెటింగ్ హెడ్ వేద్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘‘ఈ నాలుగు ఫిల్మ్స్ ద్వారా ట్రూ ఎలిమెంట్స్ నిజాన్ని చేదుగా కాకుండా అమాయక ధోరణిలో చెప్పేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాం. అదే సమయంలో బ్రాండ్ తో అనుబంధం పెరిగేలా చూడడాన్ని కూడా ఇది లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ ఫిల్మ్స్ యూట్యూబ్ వంటి వీడి యో – ఫస్ట్ ప్లాట్ ఫామ్స్, సోషల్ మీడియా, ఓటీటీలలో, అదే విధంగా యూజీసీలో రానున్నాయి. ఈ బ్రాండ్ పై అవగాహన కలిగించేలా ఐదు కోట్ల మందిని చేరుకోనున్నాయి’’ అని అన్నారు.

ఈ సందర్భంగా టీబీడబ్ల్యూఏ ఇండియా సీఈఓ గోవింద్ పాండే మాట్లాడుతూ, ‘‘ఆరోగ్యదాయకం, రుచికరం అంటూ జరిగే ప్రచారాలను ప్రజలు గుర్తిస్తున్నారు. నిజాలను తెలుసుకుంటున్నారు. ‘ట్రూయింగ్ ట్రూయింగ్ వాట్ యూ డూయింగ్’ అనే మా క్యాంపెయిన్, ఈట్, స్టే, లివ్ లలో క్లీన్, హెల్తీ, ట్రూ అయిన వాటిని ఎంచుకునే వారి కోసం. పాత్రలు, సందర్భాలు ఎంతో చార్మింగ్ గా, హాస్యంతో కూడుకున్నవిగా ఉంటాయి. ట్రూ ఎలిమెంట్స్ ప్రపం చం లోకి రావాల్సిందిగా కొనుగోలుదారులకు ఆహ్వానం పలుకుతాయి. రుచి చూడకుండా ఉండలేనంతగా’’ అని అన్నారు.

టీబీడబ్ల్యూఏ మేనేజింగ్ పార్ట్ నర్ పరీక్షిత్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘‘ప్యాక్ లోపల ఏముందో ట్రూ ఎలిమెంట్స్ మీకు చెబుతుంది. కంపెనీ గురించిన నిజాలే దాని కమ్యూనికేషన్ కు పునాదిగా మారాయి. దాని ఫలితంగానే ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు, ‘ట్రూయింగ్ ట్రూయింగ్, వాట్ యూ డూయింగ్’ అని’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News