Monday, December 23, 2024

‘ట్రూ లవర్‘.. ఓ విభిన్న ప్రేమ కథ

- Advertisement -
- Advertisement -

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ‘ట్రూ లవర్‘. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ‘ట్రూ లవర్‘ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

ఇప్పటిదాకా ‘ట్రూ లవర్‘ నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ వంటి కంటెంట్ మొత్తానికి మంచి స్పందన వచ్చింది. డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్‌కు ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా ఆఫర్స్ వస్తాయి. ప్రేమికురాలి విషయంలో అబ్బాయిలో ఉండే అభద్రతను తన నటనలో సహజంగా మణికందన్ చూపించాడు. అలాగే లవర్ ఇన్‌సెక్యూరిటీని చూసి బాధపడే అమ్మాయిగా శ్రీ గౌరి ప్రియ నటన ఆకట్టుకుంటుంది”అని అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ “ట్రూ లవర్ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్‌గా తెరకెక్కించాడు. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ సినిమాతో ఈ వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో మణికందన్, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News