Thursday, November 14, 2024

ఇయర్‌ 2ను విడుదల చేసిన ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ సెట్‌..

- Advertisement -
- Advertisement -

లండన్‌ కేంద్రంగా కలిగిన సాంకేతిక బ్రాండ్‌, నథింగ్‌ (Nothing), ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ సెట్‌ ఇయర్‌ (2) (Ear (2))ను విడుదల చేసింది. Nothing యొక్క ప్రతిష్టాత్మక పారదర్శక డిజైన్‌ను ఎలైట్‌ ఇంజినీరింగ్‌, మరోదశ వ్యక్తిగతీకరణను అత్యుత్తమ ఆడియో అనుభవాల కోసం అందించేలా తీర్చిదిద్దారు. ఆధీకృత శబ్ద అనుభవాలను Ear (2) అందిస్తుంది. దీనిలో హై–రిజల్యూషన్‌ ఆడియో సర్టిఫికేషన్‌, ఎల్‌హెచ్‌డీసీ 5.0 సాంకేతికత ఉంది. వినియోగదారులు తమ సొంత సౌండ్‌ ప్రొఫైల్‌ను నథింగ్‌ ఎక్స్‌ (NothingX)యాప్‌పై వినికిడి పరీక్ష చేసుకోవడం ద్వారా నిర్ధేశించుకోవచ్చు. అప్పుడు Ear (2) ఈ ఈక్విలైజర్‌ సెట్టింగ్స్‌ను రియల్‌ టైమ్‌లో అత్యుత్తమ శబ్ద నాణ్యత కోసం మార్చుకుంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌లో 11.6 మిల్లీ మీటర్ల కస్టమ్‌ డ్రైవర్‌ లోతైన, అత్యంత శక్తివంతమైన బాస్‌, క్రిస్టల్‌ క్లియర్‌ హైస్‌ కోసం కలిగి ఉండటంతో పాటుగా నూతన డ్యూయల్‌ చాంబర్‌ డిజైన్‌ మొత్తంమ్మీద శబ్ద నాణ్యతను మృదువైన గాలి ప్రవాహంతో అందిస్తుంది.

అంతేకాదు, అతి సులభంగా డివైజ్‌ల మధ్య మారేందుకు డ్యూయల్‌ కనెక్షన్‌ సైతం Ear(2)లో ఉంటుంది. ఇది గాలి నిరోధతను మెరుగుపరచడంతో పాటుగా, క్రౌడ్‌–ఫ్రూఫ్‌ క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ, పర్సనలైజ్డ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఉంటుంది. ఇది వినూత్నమైన రీతిలో వినియోగదారుల ఇయర్‌ కెనాల్‌ ఆకృతిలో ఉంటుంది. ‘‘మా తొలి ఉత్పత్తి EAR (1) కు ప్రతిష్టాత్మక ఆధునీకరణలను చేసి Ear(2) పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇప్పటికే Ear (1) ను 6లక్షల యూనిట్లకు పైగా విక్రయించాము’’ అని కార్ల్‌ పీ, సీఈఓ మరియు కో–ఫౌండర్‌, Nothing అన్నారు. ‘‘EAR (2) తో మేము ప్రతి ఒక్కటీ ఆధునీకరించాము. అత్యుత్తమ వ్యక్తిగత శ్రవణ అనుభవాలను సైతం సృష్టించేందుకు విప్లవాత్మక సాంకేతికత సృష్టించాము’’ అని అన్నారు.

అసలైన అధీకృత శబ్దం

పూర్తిగా లీనమయ్యే శబ్ద అనుభవాలను అందించడం కోసం హై–రిజల్యూషన్‌ ఆడియో సర్టిఫైడ్‌గా Ear(2) ఉంటుంది. ఇది మిమ్మల్ని రికార్డింగ్‌ స్టూడియోకు తీసుకువెళ్తుంది. LHDC 5.0 codec సాంకేతికత అతి సూక్ష్మమైన శబ్ద వివరాలు సైతం స్పష్టంగా వినగలరనే భరోసాను అందిస్తుంది. ఇది పరిశ్రమలో అత్యున్నత ప్రమాణంగా నిలువడంతో పాటుగా 24 బిట్‌/192 కిలోహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీని 1ఎంబీపీఎస్‌ వేగాలతో అందిస్తుంది.

Ear (2) లో 11.6 మిల్లీ మీటర్‌ డైనమిక్‌ డ్రైవర్‌, కస్టమ్‌ డయాఫారంతో ఉంది. ఇది మెరుగైన ఎకౌస్టిక్‌ పనితీరు అందిస్తుంది. పాలీయురేథిన్‌, గ్రాఫైన్‌ మెటీరియల్స్‌ సమ్మేళనంతో డిజైన్‌ చేసిన ఈ ఇయర్‌ బడ్స్‌ మరింత మెరుగైన ఫ్రీక్వెన్సీలు మరియు లోతైన, మృదువైన బాస్‌ అందిస్తుంది. దీనితో పాటుగా వినూత్నమైన డ్యూయల్‌ ఛాంబర్‌ డిజైన్‌ ఉండటంతో పాటుగా భారీ స్పేస్‌ను మృదువైన ఎయిర్‌ ఫ్లో, మరింత స్పష్టమైన శబ్దం అందిస్తుంది.

రీ ఇంజినీర్డ్‌ బ్రిలియన్స్‌

Nothing యొక్క మొదటి తరపు ఆడియో ఉత్పత్తితో పోలిస్తే మరింత మెరుగ్గా Ear (2)ను సృష్టించారు. ఇది వినియోగదారులకు మరింత వ్యక్తిగతీకరించిన మరియు సౌకర్యవంతమైన వినికిడి అనుభవాలను అందిస్తుంది. ఇది ప్రతిరోజూ అవసరాలను తీర్చనుంది. దీనిలో డ్యూయల్‌ కనెక్షన్‌, వ్యక్తిగతీకరించిన సౌండ్‌ ప్రొఫైల్‌ ఉన్నాయి. వీటితో పాటుగా Nothing యొక్క అత్యాధునిక క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ, యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంది.

డ్యూయల్‌ కనెక్షన్‌

డ్యూయల్‌ కనెక్షన్‌ ను Ear (2) అందిస్తుంది. దీనితో వినియోగదారులు ఒకేసారి రెండు డివైజస్‌తో కనెక్ట్‌ కావొచ్చు, అత్యంత సౌకర్యవంతంగా సంగీతం లేదా కాల్స్‌ను అందుకోవడం చేయవచ్చు. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు ల్యాప్‌టాప్‌పై సంగీతాన్ని ఆస్వాదిస్తూనే తమ ఫోన్‌పై కాల్‌నూ అందుకోవచ్చు. Ear(2) ఆటోమేటిక్‌గా వారికి ఇన్‌కమింగ్‌ కాల్‌ గురించి వెల్లడిస్తుంది. ఇయర్‌బడ్‌పై ప్రెస్‌ కంట్రోల్‌ వినియోగించడం ద్వారా అతి సులభంగా వారి కాల్‌కు సమాధానం అందించవచ్చు. కాల్‌ ముగియగానే, ఇయర్‌బడ్స్‌ ఆటోమేటిక్‌గా ల్యాప్‌టాప్‌ నుంచి సంగీతం వినిపించడం ప్రారంభిస్తుంది.

వ్యక్తిగత సౌండ్‌ ప్రొఫైల్‌

ప్రతి వ్యక్తి శ్రవణ అవసరాలను తీర్చే రీతిలో ఆడియో ఉత్పత్తిని రూపొందించడానికి Nothing కృషి చేస్తుంది. హియరింగ్‌ ఐడీతో వినియోగదారులు వ్యక్తిగత సౌండ్‌ ప్రొఫైల్‌ను సృష్టించుకోవడంలో Ear (2) తోడ్పడుతుంది. NothingX యాప్‌పై హియరింగ్‌ టెస్ట్‌ తీసుకున్న తరువాత, Ear (2) ఈక్విలైజర్‌ లెవల్స్‌ను వాస్తవ సమయంలో మార్చుకోవడంతో పాటుగా వినియోగదారుల హియరింగ్‌కు మ్యాచ్‌ చేస్తూ అత్యున్నత వినికిడి అనుభవాలను సైతం అందిస్తుంది.

క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ

అతి స్పష్టమైన కాల్స్‌ కోసం, Ear (2) లో Nothing యొక్క అత్యుత్తమ క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ ఉంది. మూడు హై డెఫినేషన్‌ మైక్రోఫోన్ల ప్రతి ఇయర్‌బడ్‌లో ఉండటంతో పాటుగా ఏఐ నాయిస్‌ రిడక్షన్‌ అల్గారిథమ్‌ సైతం ఉండటం వల్ల 20 మిలియన్‌ సౌండ్‌ శాంపిల్స్‌ను ఫిల్టర్‌ చేస్తుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ శబ్దాలను Ear (2) తొలగించడంతో పాటుగా రియల్‌ టైమ్‌లో కాల్స్‌ సమయంలో వినియోగదారుల వాయిస్‌ను సైతం మెరుగుపరుస్తుంది.

యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌

Nothing యొక్క అత్యుత్తమ నాయిస్‌ క్యాన్సిలేషన్‌గా తీర్చిదిద్దబడిన Ear (2) 40డెసిబల్స్‌ వరకూ నాయిస్‌ రిడక్షన్‌ చేరుకుంది. వ్యక్తిగతీకరించిన నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను వినియోగదారుల ఇయర్‌ ప్యానెల్‌కు తగినట్లుగా తీర్చిదిద్దారు. ఇది అడాప్టివ్‌ మోడ్‌ కలిగి ఉండటం వల్ల నాయిస్‌ రిడక్షన్‌ను సైతం వాస్తవ సమయంలో పర్యావరణానికి అనుగుణంగా తగ్గించడం జరుగుతుంది. Ear (2) గరిష్ట నాయిస్‌ క్యాన్సిలేషన్‌ అనుభవాలను అందిస్తుంది

మెరుగైన పనితీర

Ear (2) 36 గంటల వరకూ మ్యూజిక్‌ ప్లే బ్యాక్‌ను ఒకసారి చార్జింగ్‌ కేస్‌ ఫుల్‌ చార్జ్‌ చేసిన మీదట (ఏఎన్‌సీ టర్న్‌ ఆఫ్‌ చేసిన ఎడల)అందిస్తుంది. ఫాస్ట్‌ చార్జ్‌తో, ఇది 10 నిమిషాల చార్జింగ్‌తో 8 గంటల సంగీతం అందిస్తుంది. Ear (2) లో 2.5 వాట్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌ ఉంది. ఇది అనుకూలమైన డివైజస్‌ అంటే Nothing Phone (1) కు రివర్శ్‌ చార్జింగ్‌ సైతం అందిస్తుంది.

ప్రతి రోజూ అవసరాలకు తగినట్లుగా Ear (2) నిర్మితమైంది. ఇది ఐపీ54 వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ను తమ ఇయర్‌బడ్స్‌కు కలిగి ఉంది. చార్జింగ్‌ కేస్‌ ఐపీ55 రేటింగ్‌ కలిగి ఉండటం వల్ల పూర్తి మనశ్శాంతి పొందవచ్చు.

మరింత సౌకర్యవంతమైన, ఖచ్చితమైన వినియోగదారుల అనుభవాల కోసం, Ear(2)లో ప్రెస్‌ కంట్రోల్స్‌ ఉన్నాయి. ఇవి ఎలాంటి ప్రమాదవశాత్తు స్పర్శలను అయినా నిరోధించడంతో పాటుగా ఇయర్‌ కెనాల్‌కు అసౌకర్యమూ తగ్గిస్తుంది. వినియోగదారులు ట్రాక్స్‌ స్కిప్‌ చేయడం, నాయిస్‌ క్యాన్సిలేషన్‌ మోడ్స్‌ మధ్య మారడం, వాల్యూమ్‌ మార్చుకోవడం అన్నీ కూడా ప్రెస్‌ తోనే సాధ్యమవుతాయి. ఈ కంట్రోల్స్‌ను Nothing X యాప్‌లో వ్యక్తిగత అవసరాల కోసం కస్టమైజ్‌ చేయవచ్చు. ఇది ఒన్‌ స్టాప్‌ షాప్‌గా Ear (2) కు నిలుస్తుంది. దీనిని గుగూల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

వేగవంతమైన కనెక్షన్

గుగూల్‌ ఫాస్ట్‌ పెయిర్‌కు ఆండ్రాయిడ్‌ ఉపకరణాలపై మరియు విండోస్‌ ఉపకరణాలపై మైక్రోసాఫ్ట్‌ స్విఫ్ట్‌కు Ear(2) మద్దతు అందిస్తుంది. ఒకసారి ఫోన్‌ (1)కు గేమ్‌ మోడ్‌లో కనెక్ట్‌ అయితే, ఈ ఇయర్‌ బడ్స్‌ ఆటోమేటిక్‌గా లో ల్యాగ్‌ మోడ్‌లో మెరుగైన గేమింగ్‌ అనుభవాల కోసం టర్న్‌ ఆన్‌ అవుతుంది. ఫోన్‌ వినియోగించని (1) వినియోగదారులు, వారు మాన్యువల్‌గా Nothing X యాప్‌ పై లో ల్యాగ్‌ మోడ్‌పై మాన్యువల్‌గా టర్న్‌ ఆన్‌ అవుతుంది

ధర మరియు లభ్యత

అంతర్జాతీయంగా Ear(2) ధరలు 129 పౌండ్లు/149 డాలర్లుగా ఉంది. భారతదేశంలో మాత్రం వీటిని 9999 రూపాయలకు విడుదల చేయనున్నారు. Ear (2) ఇయర్‌బడ్స్‌ ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ స్టోర్లపై 28 మార్చి 2023 మధ్యాహ్నం 12 గంటల నుంచి లభ్యమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News