న్యూఢిల్లీ: ప్రఖ్యాత అంతర్జాతీయ కమ్యూనికేషన్స్ వేదిక అయిన ట్రూకాలర్ రానున్న వారాల్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్రొడక్ట్ ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. కొత్త ఫీచర్లలో VoIP కాలింగ్ కోసం వాయిస్ కాల్ లాంచర్, SMS ఇన్‌బాక్స్ కోసం పాస్‌కోడ్ లాక్, మెరుగైన కాల్ లాగ్స్, సింప్లిఫైడ్ & ఇన్‌స్టంట్ కాల్ రీజన్, వీడియో కాలర్ ID కోసం ఫేస్ ఫిల్టర్స్, AI స్మార్ట్ అసిస్టెంట్ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ సురక్షితమైన, అవాంతరాలు లేని, సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను యూజర్లకు అందిస్తాయి.
రాబోయే పరిణామాలపై చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ ఝూన్‌ఝూన్‌వాలా మాట్లాడుతూ, “ కొత్త ఆవిష్కరణలు చేపట్టేందుకు మెరుగైన సేవలందించేందుకు మా యూజర్ల నుంచి నిరంతరం అందుకునే ఫీడ్‌బ్యాక్ మాకు ఎంతో సాయపడుతుంది. త్వరలో రాబోతున్న ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యూజర్లను ఉత్తేజితం చేస్తాయని హామీ ఇస్తున్నాం. ఈ ఫీచర్లు సమర్థవంతమైన, సురక్షితమైన కమ్యూనికేషన్ అనుభూతిని యూజర్లకు అందించడమే కాదు కమ్యూనికేషన్, ముఖ్యమైన డేటా విషయంలో అధిక నియంత్రణ కలిగి ఉండేందుకు తగిన శక్తిని అందిస్తాయి” అన్నారు.
ట్రూకాలర్‌లో రాబోయే ఫీచర్లు ఇవి:
-వాయిస్ కాల్ లాంచర్ – ట్రూకాలర్ వాయిస్‌లో మాట్లాడేందుకు మీ కాంటాక్ట్స్‌లో అందుబాటులో ఉన్నవారిని గుర్తించేందుకు సులభమైన మార్గం వాయిస్ లాంచర్. కేవలం ఒక ట్యాప్‌తో మీరు మీ ప్రియమైన వారితో కనెక్ట్ అయి ఉచిత, హై డెఫినిషన్, VoIP ఆధారిత కాలింగ్ ఆస్వాదించవచ్చు.
– SMS కోసం పాస్‌కోడ్ లాక్ – మీరు అడిగారు మేము అందించాం. మీ టెక్ట్స్ మెసేజ్‌ల ప్రైవసీ కోసం, పర్సనల్ డేటా సెక్యూరిటీ కోసం మీరు త్వరలోనే పాస్‌కోడ్ లాక్ ఉపయోగించి అదనపు భద్రత ఏర్పాటు చేసుకోవచ్చు. మీ డివైస్ బయోమెట్రి్ లేదా ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సపోర్టు చేస్తే మీరు దాన్ని కూడా ఉపయోగించకోవచ్చు. సున్నితమైన సమాచారం ఇతరుల కళ్లబడకుండా చూసేందుకు ఇంత కంటే మంచి మార్గం లేదు.
– మెరుగైన కాల్ లాగ్స్ – కాల్స్ అనేవి వ్యాపారాలకు ప్రాథమిక అవసరం. ముందు రోజు కాల్స్ యాక్సెస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కాల్ లాగ్స్‌ను ట్రూకాలర్ మెరుగుపరిచింది. గత వెర్షన్‌లో 1000 ఎంట్రీలకు స్థానం ఉండగా ఇప్పుడు కాల్ లాగ్స్ 6400 ఎంట్రీలకు సపోర్టు చేస్తుంది.
– మెరుగైన కాల్ రీజన్–కాల్ చేస్తున్న సమయంలోనే ఎందుకు కాల్ చేస్తున్నారో యాడ్ చేయడం ఇప్పుడు సాధ్యమవుతుంది. ఫోన్ రింగ్ అవుతున్నా మీరు కాల్ చేసిన వ్యక్తి మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినప్పుడు మీరు వెంటనే ఇన్‌స్టంట్ కాల్ రీజన్ యాడ్ చేయవచ్చు. ‘చాలా ముఖ్యం’, మనం మాట్లాడుకుందామా?’ వంటి మెసెజస్ ముందుగానే ఉంటాయి. అంతే కాకుండా మీరు ఎందుకు కాల్ చేస్తున్నారో ఆ కారణాన్ని మీరు మీకు నచ్చిన రీతిలో టైప్ చేసుకొని పంపించే వెసులుబాటు కూడా ఉందిచ్చు
-వీడియో కాలర్ ID కోసం ఫేస్ ఫిల్టర్‌లు – కాలింగ్ అనుభూతి మరింత ఉత్తేజకరంగా, మరింత వ్యక్తిగతంగా ఉంచేలా చూసి ప్రత్యేకమైన కాలింగ్ అనుభూతి అందించే లక్ష్యంతో ట్రూకాలర్ ఇన్‌బిల్ట్ టెంప్లేట్స్ అందిస్తోంది. మరింత సృజనాత్మకంగా ఉండేందుకు, వీడియో కాలర్ ఐడీ అనుభూతిని పెంచేందుకు సెల్ఫీ, VR పవర్డ్ ఫిల్టర్లు ఉన్నాయి. యూజర్లు తమ సంభాషణ విషయంలో బాధ్యతగా ఉండేలా చూడటం, సహచరులతో సమర్ధవంతంగా పాల్గొనడం, ఇంటర్నెట్ అనే వర్చువల్ ప్రపంచాన్ని పూర్తిగా సద్వినియోగం చేసేలా చూడటం ట్రూకాలర్ లక్ష్యం, యాప్‌లోని కొత్త ఫీచర్లు నేటి తరానికి ఉత్తేజకరంగా నిలుస్తాయి. అవి కేవలం ఫంక్షనల్ టూల్సే కాదు, సమయాన్ని ఆదా చేస్తాయి, ఈ వేగవంతమైన ప్రపంచంలో ఉపయోగించడానికి సురక్షితమైనవి కూడా.
Truecaller announced will launch new product map