- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ యాప్ ట్రూకాలర్ దేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు కొత్త ఫీచర్లను ప్రకటించింది. వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్లలో గ్రూప్ వాయిస్ కాలింగ్, స్మార్ట్ ఎస్ఎంఎస్, ఇన్‌బాక్స్ క్లీనర్ ఉన్నాయి. ట్రూకాలర్ ఇండియా ఎండి రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ. వినియోగదారులకు అవసరా ల మేరకు ఈ ఫీచర్లు రూపొందించామని, ఇవి సంస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మరింత సహకరిస్తాయని అన్నారు.
Truecaller introduces 3 new features for Android users
- Advertisement -