Wednesday, January 22, 2025

పీటీఎంటీ ఫౌసెట్‌లు, యాక్ససరీల విభాగంలో ప్రవేశించిన ట్రూఫ్లో బై హింద్‌వేర్‌..

- Advertisement -
- Advertisement -

దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్లాస్టిక్‌ పైపులు, ఫిట్టింగ్స్‌ బ్రాండ్‌ ట్రూఫ్లో బై హింద్‌వేర్‌ తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. దీనిలో భాగంగా పీటీఎంటీ ఫౌసెట్స్‌, ఫ్లష్‌ ట్యాంకులు, సీట్‌ కవరింగ్స్‌, ఇతర యాక్ససరీలతో కూడిన బాత్‌ ఫిట్టింగ్స్‌ విభాగంలో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. ట్రూఫ్లో ఇప్పుడు పీటీఎంటీ ఫౌసెట్స్‌ కోసం 14 డిజైన్‌ వేరియంట్లను, 6 ఫ్లష్‌ ట్యాంక్‌ వేరియంట్లను విడుదల చేయడం ద్వారా విభిన్నమైన వినియోగదారుల అవసరాలను తీర్చనుంది.

ఈ నూతన బాత్‌ ఫిట్టింగ్స్‌శ్రేణి ని 100 % ఫుడ్‌ గ్రేడ్‌ మెటీరియల్‌తో తయారుచేస్తున్నారు. దీనిలో అత్యాధునిక ఇంజినీర్డ్‌ ధర్మోప్లాస్టిక్‌ పాలిమర్‌ ఉంది. తద్వారా అత్యుత్తమ మన్నిక, మహోన్నత పనితీరుకు భరోసా అందిస్తుంది. దీనిలో సిల్వర్‌ అయాన్‌ నానో టెక్నాలజీ ఉంది. యాంటీ బ్యాక్టీరియల్‌ చికిత్స శక్తివంతం కావడం చేత మైక్రోబయాల్‌ వృద్ధిని అడ్డుకుంటూనే సురక్షితమైన, స్వచ్ఛమైన నీటి కి భరోసా అందిస్తుంది.

కేవలం అతి కొద్ది మంది ఆర్గనైజ్డ్‌ ప్లేయర్లు మాత్రమే పీటీఎంటీ విభాగంలో ఉన్నారు.ఈ విభాగం గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. వేగవంతమైన నగరీకరణ, న్యూక్లియర్‌ కుటుంబాలు పెరగడం, మౌలిక వసతుల వృద్ధి పరంగా ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రైవేట్‌, ప్రభుత్వ పెట్టుబడులు గృహ నిర్మాణ రంగంలో పెరుగుతుండటం వంటివి ఈ వృద్ధికి తోడ్పడతాయి.

ట్రూఫ్లో , హైదరాబాద్‌లోని ఇస్నాపూర్‌ వద్ద నున్న తమ రెండవ తయారీ కేంద్రంలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. ఈ సదుపాయంతో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30వేల టన్నుల నుంచి 48 వేల టన్నులకు పెరగనుంది. దీనితో పాటుగా నూతన ఉత్పత్తి విభాగాల అవసరాలు సైతం తీరనున్నాయి.

ఈ కంపెనీ ఇప్పుడు రిలయన్స్‌ వరల్డ్‌వైడ్‌ కార్పోరేషన్‌ (ఆర్‌డబ్ల్యుసీ)తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది.దీని ద్వారా షార్క్‌ బైట్‌ యొక్క మల్టీ లేయర్‌ కంపోజిట్‌ పైప్‌ ప్లంబింగ్‌ సొల్యూషన్‌ను మార్కెట్‌ చేయడంతో పాటుగా ప్రీమియం హౌసింగ్‌, ప్రాజెక్ట్‌ విభాగాలపై దృష్టి సారించనుంది. యూరోప్‌, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ప్లంబింగ్‌, హీటింగ్‌ యాక్ససరీల పరంగా అగ్రగామి సంస్ధ ఆర్‌డబ్ల్యుసీ. ఈ భాగస్వామ్యం, దేశంలో ప్లాస్టిక్‌ పైపులు, ఫిట్టింగ్‌ విభాగంలో అగ్రగామి సంస్ధగా నిలవాలనే ట్రూ ఫ్లో దీర్ఘకాలిక నిబద్ధతను వెల్లడిస్తుంది.

ట్రూఫ్లో బై హింద్‌వేర్‌ లిమిటెడ్‌ సీఈఓ రాజేష్‌ పజ్నూ మాట్లాడుతూ ‘‘పీటీఎంటీ ఫౌసెట్స్‌ విభాగంలో ప్రవేశించడమన్నది మా జాబితాకు అతి సహజసిద్ధమైన కొనసాగింపు. వినియోగదారుల ప్లంబింగ్‌ అవసరాలన్నింటికీ ఏకీకృత పరిష్కారం అందించాలన్నది మా లక్ష్యం. భారతదేశంలో మా రెండవ తయారీ కేంద్రం నుంచి వాణిజ్యఉత్పత్తి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ప్లాస్టిక్‌ పైపులు మరియు ఫిట్టింగ్స్‌ విభాగంలో అత్యంత వేగంగా మేము వృద్ధి చెందుతున్నాము’’అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ ‘‘ రిలయన్స్‌ వరల్డ్‌వైడ్‌ కార్పోరేషన్‌తో మా భాగస్వామ్యం మా దీర్ఘకాలిక వ్యూహంలో భాగం. దీనిద్వారా భారతదేశంలో ప్లాస్టిక్‌ పైపులు మరియు ఫిట్టింగ్స్‌ విభాగంలో ప్రీమియం ఉత్పత్తులను అందించనున్నాము మరియు భారతదేశంలో ప్లంబింగ్‌ కమ్యూనిటీతో అతి సన్నిహితంగా కలిసి పనిచేయనున్నాము’’అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News